Advertisement
Advertisement
Abn logo
Advertisement

14 ఏళ్లకే అతను కామాంధుడిగా మారాడు.. పొరుగునే ఉన్న మైనర్ బాలికపై కన్నేశాడు.. ఊరి పెద్దలు సైతం అతనికి అండగా నిలిచారు

14 ఏళ్ల ఓ కుర్రాడు తన గ్రామంలోని యువతులను వేధించేవాడు. అతనిపై ఫిర్యాదు చేసినా ఊరి పెద్దలు కలుగచేసుకొని సమస్యను కప్పిపుచ్చారు. చివరికి బాధితురాలలి తల్లి పోలీసులను ఆశ్రయించింది.


ఝార్ఖండ్ రాష్ట్రంలో గొడ్డా జిల్లా పరిధిలోని ఒక గ్రామంలో బబ్లూ(14) అనే పెద్దింటి కుర్రాడు చేసే వికృత చేష్టలకు ఆ ఊరి పెద్దలు అండగా నిలిచారు. ఇప్పటికే బబ్లూ గ్రామంలోని యువతులను వేధిస్తున్నాడని ఫిర్యాదులొస్తున్నాయి. కానీ అతడిని శిక్షించడానికి ఎవరూ ముందుకు రావడంలేదు. ఇదే అదునుగా తీసుకొని బబ్లూ మరింతగా రెచ్చిపోయాడు.


అదే గ్రామంలో నివసించే పల్లవి(15) అనే అమ్మాయి ఒకరోజు పొలంలో తన తల్లితో కలిసి పనిచేసుకుంటోంది. పల్లవి తల్లి కాసేపు పశువులకు మేత వేసేందుకు అక్కడి నుంచి వెళ్లగా.. అదే సమయంలో బబ్లూ పల్లవిని గట్టిగా పట్టుకొని.. నోట్లో గుడ్డ కుక్కి అక్కడి నుంచి ఈడ్చుకొని తీసుకెళ్లి ఆమెపై అత్యాచారం చేశాడు. బబ్లూ చేసిన అఘాయిత్యాన్ని పల్లవి తల్లి ఊరి పెద్దల దృష్టికి తీసుకెళ్లింది. కానీ వాళ్లు బబ్లూని కాపాడేందుకే ప్రయత్నించారు. బబ్లూ చిన్నవాడని.. ఏదో తాగిన మైకంలో తప్పుచేశాడని.. ఏమైనా డబ్బులు తీసుకొని రాజీపడాలని పల్లవి తల్లికి సూచించారు.


కానీ పల్లవి తల్లి తనకు న్యాయం కావాలని పోలీసులను ఆశ్రయించింది. బబ్లూ, ఊరి పెద్దలపై ఫిర్యాదు చేసింది. పోలీసులు బబ్లూని అరెస్టు చేయడానికి అతని ఇంటికి వెళ్లగా.. బబ్లూ పరారీలో ఉన్నట్లు తెలిసింది. అప్పుడు పోలీసులు పకడ్బందీగా ప్లాన్ వేసి బబ్లూని పట్టుకున్నారు. ప్రస్తుతం బబ్లూని పోలీసుల అదుపులోని రిమాండ్ హోంలో ఉన్నాడు.

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement