HYD : స్కూల్‌ నుంచి Carలో తీసుకెళ్లి మేనల్లుడిపై మేనత్త లైంగిక దాడి.. రూ. 6 లక్షలు అడిగిందని..!

ABN , First Publish Date - 2021-12-03T16:17:41+05:30 IST

స్కూల్‌ నుంచి Carలో తీసుకెళ్లి మేనల్లుడిపై మేనత్త లైంగిక దాడి.. రూ. 6 లక్షలు అడిగిందని..!

HYD : స్కూల్‌ నుంచి Carలో తీసుకెళ్లి మేనల్లుడిపై మేనత్త లైంగిక దాడి.. రూ. 6 లక్షలు అడిగిందని..!

హైదరాబాద్ సిటీ/బంజారాహిల్స్‌ : బాలుడిపై మేనత్త లైంగిక దాడి చేయడమే కాకుండా డబ్బు కోసం బెదిరింపులకు పాల్పడింది. నగరంలోని ఓ కుటుంబం ఇటీవల ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతంలోకి మారింది. ఇంటి సామగ్రిని సద్దుతుండగా 200 గ్రాముల బంగారం కనిపించలేదు. ఈ విషయంపై తల్లి తన కుమారుడిని(14) నిలదీసింది. ఆ బంగారం తీసి మేనత్తకు ఇచ్చినట్టు చెప్పాడు. మరింత లోతుగా ప్రశ్నించగా మేనత్త తన మాజీ భర్తతో కలిసి తనను పలుమార్లు స్కూల్‌ నుంచి కారులో ఎక్కించుకొని వెళ్లి ఓ లాడ్జిలో లైంగిక దాడి చేసినట్టు చెప్పాడు. వాటిని సెల్‌ఫోన్‌తో చిత్రీకరించి ఇంటర్నెట్‌లో పెట్టకుండా ఉండేందుకు ఆరు లక్షలు అడిగిందని బాలుడు తల్లికి చెప్పాడు. అందుకే బంగారాన్ని చోరీ చేసి ఆమెకు ఇచ్చినట్లు చెప్పాడు. బాధితుడి తల్లి ఫిర్యాదు మేరకు ఆమెపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Updated Date - 2021-12-03T16:17:41+05:30 IST