Advertisement
Advertisement
Abn logo
Advertisement

కరోనా ఎఫెక్ట్: కువైట్‌ను వీడిన 1.40 లక్షల మంది ప్రవాసులు !

కువైట్ సిటీ: మహమ్మారి కరోనా గల్ఫ్‌లోనూ తీవ్ర ప్రభావాన్ని చూపిన విషయం తెలిసిందే. దీంతో పొట్టచేతపట్టుకుని గల్ఫ్ దేశాలకు వెళ్లిన ప్రవాసులు భారీ సంఖ్యలో ఉపాధి కోల్పోయి స్వదేశానికి తిరిగి రావాల్సిన పరిస్థితి దాపురించింది. ఇలా కరోనా ప్రభావం వల్ల ఒకే ఏడాదిలో కువైట్‌ను సుమారు 1.40 లక్షల మంది ప్రవాసులు వీడినట్లు తాజా లెక్కలు చెబుతున్నాయి. గతేడాది ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు లక్ష 40వేల మంది ప్రవాసులు ఉపాధి కోల్పోవడంతో తిరిగి స్వదేశానికి వెళ్లిపోయినట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. వీరిలో 39 శాతం మంది డొమెస్టిక్ వర్కర్స్ ఉన్నారు.    

Advertisement

తాజా వార్తలుమరిన్ని...

Advertisement