Abn logo
Sep 27 2021 @ 17:25PM

ఊరి చివర్లో ఉన్న బావిలో దొరికిన పసికందు మృతదేహాం.. ఆరాతీస్తే వెలుగులోకి విస్తుపోయే విషయాలు..!

ఇంటర్నెట్ డెస్క్: ఊరి చివరలో హనుమాన్ టెంపుల్ దగ్గర ఉన్న బావిలో దొరికిన పసికందు మృతదేహం బయటపడింది. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆ మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహిస్తే.. పుట్టిన వెంటనే ఆ పాపను బావిలో పడేసినట్లు తేలింది. ఊపిరితిత్తుల్లోకి నీరు చేరడం వల్లే ప్రమాన ఆ పసికందు ప్రాణాలు కోల్పోయినట్లు శవపరీక్షలో వెల్లడైంది. దీంతో ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు.. విచారణ ప్రారంభించగా సంచలన విషయాలు వెలుగులోకి వొచ్చాయి. మధ్యప్రదేశ్‌లోని చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. 


సెప్టెంబర్ 20న మధ్యప్రదేశ్‌లోని కద్వయ గ్రామం ఒక్కసారిగా వార్తలోక్కి ఎక్కింది. ఊరి చివర బావిలో పసికందు బయటపడిన ఘటన స్థానికంగా చర్చనీయాంశం అయింది. కొందరు గ్రామ ప్రజలు బావిలో ఉన్న మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అక్కడకు చేరుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అప్పుడే పుట్టిన బిడ్డను బావిలో పడేసినట్లు పోస్ట్‌మార్టంలో వెల్లడవంతో.. రంగంలోకి దిగిన పోలీసులు.. అదే గ్రామానికి ఓ 14ఏళ్ల బాలికే ఈ పని చేసినట్లు గుర్తించారు. తనకు పుట్టిన బిడ్డను బావిలో పడేసి చేతులు దులుకున్నట్లు తెలుసుకుని షాక్ అయ్యారు. ఈ క్రమంలో ఆ అమ్మాయిని అదుపులోకి తీసుకుని విచారించగా సంచలన విషయాలు బయటపడ్డాయి. 


పోలీసుల దర్యాప్తులో చిన్నతనంలోనే తాను తల్లిని కోల్పోయినట్లు ఆ అమ్మాయి చెప్పింది. ఈ క్రమంలో గత ఏడాది అక్టోబర్‌లో తన తండ్రి పొలం పనులకు వెళ్లినపుడు.. తానుక్కొతే ఇంట్లో ఉన్నట్లు వెల్లడించింది. ఆ సమయంలో తమ బంధువైన చోటు విశ్వకర్మ (21) తన  ఇంటికొచ్చినట్లు పేర్కంది. తాను ఒంటరిగా ఉండటాన్ని గమనించి.. అత్యాచారం చేసినట్లు చెప్పింది. అనంతరం అతడి స్నేహితుడు కూడా తనపై అఘాయిత్యానికి పాల్పడినట్లు వెల్లడించింది. ఆ తర్వాత బెదిరింపులకు పాల్పడుతూ విశ్వకర్మ మరో ఇద్దరు స్నేహితులు కూడా అత్యాచారం చేశారని.. ఈ క్రమంలోనే 9 నెలలుగా తనపై లైగింకదాడి జరిగినట్లు ఆవేదన వ్యక్తం చేసింది. దీంతో తాను గర్భం దాల్చినట్లు వెల్లడించింది. అయితే ఆ విషయాన్ని తన తండ్రి పట్టించుకోలేదని పేర్కొంది. ఈ క్రమంలో కొద్ది రోజుల క్రితం బిడ్డకు జన్మనిచ్చినట్లు వివరించింది. ఈ విషయం బయటికి తెలిస్తే.. పరువు పోతుందనే ఉద్దేశంతో పాప పుట్టిన వెంటనే బావిలో పడేసిట్లు పేర్కొంది. కాగా.. 14 ఏళ్ల అమ్మాయిపై జరిగిన అఘాయిత్యం గురించి విన్న పోలీసులు షాక్ అయ్యారు. అనంతరం ఆ అమ్మాయిని.. రెస్క్యూ హోంకి తరలించారు. అనంతరం ఆ అమ్మాయిపై అఘ్యాయిత్యానికి పాల్పడిన నలుగురిపై పోస్కో చట్టప్రకారం కేసులు నమోదు చేసి, జైలుకు తరలించారు. 


ఇవి కూడా చదవండిImage Caption

ప్రత్యేకంమరిన్ని...