15 కొవిడ్ కేసులు
ABN , First Publish Date - 2020-12-03T06:41:10+05:30 IST
జిల్లాలో కొత్తగా 15 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. పర్చూరు, చీరాల, చిన్నగంజాం, రాచర్ల, వేటపాలెం, త్రిపురాంతకం, చీమకుర్తి, ఇంకొల్లు, పొదిలి, మార్కాపు రం, పామూరుల్లో ఇవి వెలుగు చూశాయి.
తొమ్మిది నెలల తర్వాత ఒంగోలులో పాజిటివ్‌లు నిల్
ఒంగోలు (కార్పొరేషన్), డిసెంబరు 2 : జిల్లాలో కొత్తగా 15 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. పర్చూరు, చీరాల, చిన్నగంజాం, రాచర్ల, వేటపాలెం, త్రిపురాంతకం, చీమకుర్తి, ఇంకొల్లు, పొదిలి, మార్కాపు రం, పామూరుల్లో ఇవి వెలుగు చూశాయి. తొమ్మిది నెలల తర్వాత ఒంగోలులో బుధవారం ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాకపోవడం నగర వాసులకు ఊరటనిస్తోంది. యితే నమోదైన పాజిటివ్ కేసులన్నీ ర్యాపిడ్ పరీక్షల్లో నిర్ధారణ కాగా, వీఆర్‌డీఎల్ పరీక్షలు నిర్వహించలేదు.