బోనాలకు 15 కోట్లు.. ఘనంగా నిర్వహించాలని కేసీఆర్‌ ఆదేశాలు

ABN , First Publish Date - 2021-06-22T17:58:16+05:30 IST

బోనాల నిర్వహణ, ఏర్పాట్లపై ఈ నెల 25న మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం

బోనాలకు 15 కోట్లు.. ఘనంగా నిర్వహించాలని కేసీఆర్‌ ఆదేశాలు

  • వెల్లడించిన తలసాని.. ఏర్పాట్లపై 25న సమావేశం


హైదరాబాద్‌ : బోనాల నిర్వహణ, ఏర్పాట్లపై ఈ నెల 25న మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం (ఎంసీహెచ్‌ఆర్‌డీ)లో ప్రభుత్వం తరఫున అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివా‌స్ యాదవ్‌ తెలిపారు. ఉత్సవాల నిర్వహణకు, వివిధ ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం రూ. 15 కోట్లు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. జూలై 11న గోల్కొండ బోనాలు, 25న సికింద్రాబాద్‌ బోనాలు, ఆగస్టు 1న హైదరాబాద్‌ బోనాల ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 


సమావేశంలో డిప్యూటీ స్పీకర్‌ పద్మారావు గౌడ్‌, మంత్రులు మహమూద్‌ అలీ, ఇంద్రకరణ్‌రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, ఎంపీ మల్లారెడ్డి, మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి, దేవాదాయ శాఖ కమిషనర్‌ అనిల్‌కుమార్‌, డీజీపీ మహేందర్‌రెడ్డి, పోలీస్‌ కమిషనర్లు, వివిధ శాఖల అధికారులు పాల్గొంటారని తెలిపారు. కరోనా కారణంగా గతేడాది బోనాలను నిర్వహించుకోలేక పోయామని, ఈ సంవత్సరం ఘనంగా నిర్వహించాలని కేసీఆర్‌ ఆదేశించారని తెలిపారు. అమ్మవారికి బంగారు బోనం సమర్పించాలని సీఎం ఆదేశించినట్లు తెలిపారు. 



Updated Date - 2021-06-22T17:58:16+05:30 IST