Green Pass: కోవిషీల్డ్‌కు 15 యూరోపియన్ దేశాల ఆమోదం!

ABN , First Publish Date - 2021-07-10T19:43:57+05:30 IST

'గ్రీన్‌పాస్' పథకంలో భాగంగా కరోనా టీకా కొవిషీల్డ్‌కు ఆమోదం తెలిపిన ఈయూ(యూరోపియన్ యూనియన్) దేశాల సంఖ్య 15కు చేరింది.

Green Pass: కోవిషీల్డ్‌కు 15 యూరోపియన్ దేశాల ఆమోదం!

న్యూఢిల్లీ: 'గ్రీన్‌పాస్' పథకంలో భాగంగా కరోనా టీకా కోవిషీల్డ్‌కు ఆమోదం తెలిపిన ఈయూ(యూరోపియన్ యూనియన్) దేశాల సంఖ్య 15కు చేరింది. తాజాగా బెల్జీయం ఈ జాబితాలో చేరింది. దీంతో ఈ 15 దేశాలకు కోవిషీల్డ్‌ వ్యాక్సిన్ తీసుకున్న భారతీయులు వెళ్లేందుకు మార్గం సుగమమైంది. ఈ జాబితాలో బెల్జీయం, స్విట్జర్లాండ్, ఐస్‌లాండ్, ఆస్ట్రియా, బల్గేరియా, ఫిన్లాండ్, జర్మనీ, గ్రీస్, హంగేరీ, ఐర్లాండ్, లాట్వీయా, నెదర్లాండ్, స్లోవేనియా, స్పెయిన్, స్వీడన్ ఉన్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్ ఈ విషయాన్ని ట్విటర్ ద్వారా తెలియజేశారు. "ఇప్పుడు ఈ 15 దేశాలు కొవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్న ప్రయాణికులను తమ దేశంలోకి అనుమతిస్తాయని" ఆమె ట్వీట్‌ చేశారు. ఇక 'గ్రీన్‌పాస్' పథకంలో భాగంగా ఐరోపా మెడిసన్స్‌ ఏజెన్సీ (ఈఎంఏ) ధృవీకరించిన టీకాలను వేసుకుంటే, ఈయూ దేశాల్లో ప్రయాణాలపై ఆంక్షలు ఉండబోవనే విషయం తెలిసిందే. కాగా, ఆక్స్‌ఫర్డ్-అస్ట్రాజెనెకా కరోనా టీకాను భారత్‌కు చెందిన సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా కోవిషీల్డ్‌ పేరుతో ఉత్పత్తి చేస్తున్న విషయం తెలిసిందే. 




Updated Date - 2021-07-10T19:43:57+05:30 IST