Advertisement
Advertisement
Abn logo
Advertisement

15ఏళ్ల అమ్మాయికి క్రమంగా పెరుగుతున్న పొట్ట.. డౌటొచ్చి ఆసుపత్రికి తీసుకెళ్తే..

ఇంటర్నెట్ డెస్క్: ఆ అమ్మాయికి ఇప్పుడు సుమారుగా 15ఏళ్ల వయసు ఉంటుంది. ఐదేళ్లకే ఆ అమ్మాయి తల్లిని కోల్పోవడంతో.. ఆమె యోగక్షేమాలను నానమ్మే చూసుకునేది. ఈ క్రమంలోనే కొద్ది రోజుల క్రితం ఆ అమ్మాయికి తీవ్రమైన కడుపునొప్పి వచ్చింది. అయితే కొన్ని మందులు వాడటంతో అది తగ్గిపోయింది. ఇది జరిగిన కొన్ని నెలల తర్వాత ఆ అమ్మాయి పొట్ట పరిమాణం క్రమంగా పెరుగుతూ ఉండటంతో.. ఆమె నానమ్మకు డౌటొచ్చింది. దగ్గరలోని ఆసుపత్రికి తీసుకెళ్లి, లేడీ డాక్టర్‌కు చూపింది. ఈ క్రమంలో సంచలన విషయం బయటికొచ్చింది. అదేంటనే పూర్తి వివరాల్లోకి వెళితే..


మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ ప్రాంతానికి చెందిన 15ఏళ్ల అమ్మాయి.. తన తండ్రితో కలిసి ఉంటోంది. చిన్నప్పుడే తల్లిని కోల్పోవడంతో ఆమె ఆలనాపాలనా.. ఆ అమ్మాయి నానమ్మే చూసుకుంది. ఈ క్రమంలోనే ఆమెకు కొద్ది రోజుల క్రితం కడుపు నొప్పి వచ్చింది. అయితే కొన్ని మందులు వాడటంతో అది తగ్గిపోయింది. దీంతో వాళ్లు ఆ విషయాన్ని లైట్ తీసుకున్నారు. కానీ కొద్ది రోజులుగా ఆ అమ్మాయి పొట్ట పరిమాణం క్రమంగా పెరుగుతుండటంతో.. వృద్ధురాలి(అమ్మాయి నానమ్మ)కి సందేహం కలిగింది. దీంతో శనివారం ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లి, మహిళా డాక్టర్‌తో వైద్య పరీక్షలు చేయించింది. ఈ క్రమంలో ఆ అమ్మాయి.. 7 నెలల గర్భవతి అనే విషయం బయటకొచ్చింది. దీంతో ఆ అమ్మాయిని.. వృద్ధురాలు నిలదీసింది. ఈ నేపథ్యంలో ఆమె నిజం బయటపెట్టింది.


ఈ ఏడాది మార్చి నుంచి.. ఇంట్లో అద్దెకు ఉండే వ్యక్తి, తన తండ్రి తనపై అత్యాచారం చేస్తున్నారని.. ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించే వారని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ క్రమంలో ఆ వృద్ధురాలు తన మనవరాలిని నేరుగా పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లింది. దీంతో పోలీసులు.. కేసు నమోదు చేసుకున్నారు. అంతేకాకుండా అద్దెకు ఉండే వ్యక్తి సోనుని, ఆ అమ్మాయి తండ్రిని అరెస్టు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన పోలీసులు.. ఆ అమ్మాయి తండ్రి మత్తు పదార్థాలకు బానిసై, విచక్షణ కోల్పవడం వల్లే ఈ దారుణానికి పాల్పడ్డట్టు చెప్పారు. గొడవపడి భార్య పుట్టింటికి వెళ్లడంతో.. అమ్మాయిపై సోను అత్యాచారం చేశాడని వెల్లడించారు. ఈ విషయాన్ని సోనూనే స్వయంగా ఒప్పుకున్నట్లు పేర్కొన్నారు. కాగా.. ప్రస్తుతం ఈ అంశం చర్చనీయాంశం అయింది. ఇవి కూడా చదవండిImage Caption

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement