అమ్మా.. ఈ రోజు చనిపోతే నేరుగా స్వర్గానికే వెళ్తారా..? అని ఆ 15 ఏళ్ల బాలిక అడిగింది.. ఆ తర్వాత..

ABN , First Publish Date - 2021-08-21T22:36:40+05:30 IST

అమ్మా.. ఈ రోజు చాలా మంచి రోజా.? ఈ రోజు చనిపోయిన వాళ్లు నేరుగా స్వర్గానికే వెళ్తారా?’ అని 15 ఏళ్ల కుమార్తె అడిగింది. అవునమ్మా.. అంటూ ఆ బాలిక ప్రశ్నలకు ఓ తల్లి సమాధానమిచ్చింది.

అమ్మా.. ఈ రోజు చనిపోతే నేరుగా స్వర్గానికే వెళ్తారా..? అని ఆ 15 ఏళ్ల బాలిక అడిగింది.. ఆ తర్వాత..

‘అమ్మా.. ఈ రోజు చాలా మంచి రోజా.? ఈ రోజు చనిపోయిన వాళ్లు నేరుగా స్వర్గానికే వెళ్తారా?’ అని 15 ఏళ్ల కుమార్తె అడిగింది. అవునమ్మా.. అంటూ ఆ బాలిక ప్రశ్నలకు ఓ తల్లి సమాధానమిచ్చింది. అంతే, కొద్ది గంటల్లోనే ఆ ఇంట్లో ఘోరం జరిగింది. ఆ తల్లి గుండెలు పగిలేలా ఏడవాల్సి వచ్చింది. కన్నతల్లికి కడుపుకోతను మిగిల్చి ఆ కూతురు ఆత్మహత్యకు పాల్పడింది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ నగరంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 


ఇండోర్ నగరంలోని రౌజీ బజార్ ప్రాంతంలోని చంపా భాగ్‌ ప్రాంతంలో షేక్ రబియా అనే 15 ఏళ్ల బాలిక తన తల్లిదండ్రులతో కలిసి ఉంటోంది. ఇంటర్మీడియట్ చదువుతున్న ఆ బాలిక ఆథ్యాత్మిక సంబంధిత పుస్తకాలను ఎక్కువగా చదువుతూ ఉండేది. శుక్రవారం మొహర్రం సందర్భంగా ఆ బాలిక తన తల్లిని ఓ ప్రశ్న అడిగింది. ‘అమ్మా, ఈ రోజు ఇమాం హుస్సేన్ అమరుడయ్యారా..? ఈ రోజు మరణించిన వారికి మోక్షం లభిస్తుందా..? నేరుగా స్వర్గానికి వెళ్తారా.?’ అని అడిగింది. మామూలుగానే అడిగిందేమోనని ఆ తల్లి అవునని సమాధానం ఇచ్చింది. ఆ తర్వాత కుటుంబ సభ్యులందరితో కలిసి సాయంత్రం పూట టిఫిన్ చేసిన ఆ బాలిక తన గదిలోకి వెళ్లింది. కొన్ని గంటల తర్వాత భోజనం చేసేందుకు కూతుర్ని పిలిచేందుకు ఆ తల్లి గదిలోకి వెళ్లింది. కానీ, అప్పటికే ఆ బాలిక ఉరేసుకుని చనిపోయింది. ఫ్యానుకు వేలాడుతున్న కూతురి మృతదేహాన్ని చూసి ఆ తల్లి కుప్పకూలిపోయింది. సరదాగా అడిగిందనుకున్నాను కానీ.. ఇంత ఘోరానికి పాల్పడుతుందని అనుకోలేదంటూ కన్నీరుమున్నీరుగా విలపించింది. పోలీసులు ఆ బాలిక మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత ఆ బాలిక మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 


ఇదిలా ఉండగా.. కొన్నేళ్ల క్రితం ఆ బాలిక తన స్కూలు మిత్రులందరితో కలిసి ఓ టూర్‌కు వెళ్లిందనీ, ఆ సమయంలో జరిగిన ఓ ఘటన ఆమెను బాగా కలచివేసిందని కుటుంబ సభ్యులు తెలిపారు. ‘రబియా స్నేహితురాలు ఓ ప్రమాదవశాత్తు ఆ టూర్‌లో చనిపోయింది. అదే ఘటనను మాటిమాటికీ గుర్తుకు తెచ్చుకుని బాధపడుతూ ఉండేది. పుట్టుక, మరణం, పునర్జన్మ అంటూ అప్పుడప్పుడు ఏవేవో మాట్లాడుతూ ఉండేది. మేం కోప పడేవాళ్లం. అలాంటి విషయాల గురించి ఆలోచించవద్దని చెప్పేవాళ్లం. కానీ ఇంతలోనే ఇలాంటి ఘోరానికి పాల్పడుతుందని మేం ఊహించలేకపోయాం’ అంటూ రబియా తల్లి ఆవేదన వ్యక్తం చేస్తోంది.

Updated Date - 2021-08-21T22:36:40+05:30 IST