తాలిబన్ల చెరలో భారతీయులు..?

ABN , First Publish Date - 2021-08-21T20:55:52+05:30 IST

ఫ్ఘానిస్థాన్‌లో తాలిబన్లు 150 మంది భారతీయులను శనివారం అదుపులోకి తీసుకుని అనంతరం విడిచిపెట్టినట్టు తెలుస్తోంది.

తాలిబన్ల చెరలో భారతీయులు..?

కాబూల్: అఫ్ఘానిస్థాన్‌లో తాలిబన్లు సుమారు 150 మందిని శనివారం అదుపులోకి తీసుకుని అనంతరం విడిచిపెట్టినట్టు తెలుస్తోంది. వీరిలో అధికశాతం మంది భారతీయులేనని సమాచారం. కాబూల్ ఎయిర్‌పోర్టు వద్దు విమానాల కోసం వేచి చూస్తున్న వీరిని తాలిబన్లు నేడు ఉదయం అదుపులోకి తీసుకున్నారట. అనంతరం..వారిని సమీప పోలీస్ స్టేషన్‌కు తరలించి అక్కడ పలు ప్రశ్నలు అడిగారట. వారి వద్ద ఉన్న డాక్యుమెంట్లను పరిశీలించిన తరువాత మళ్లీ వారిని ఎయిర్ పోర్టు వద్ద దిగబెట్టినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. 


ఈ క్రమంలో..తాలిబన్లు భారతీయుల్ని అపహరించారన్న వార్త వైరల్ అవడంతో భారత్‌లో కలకలం రేగింది. అయితే..తాలిబన్లు మాత్రం ఈ వార్తలను ఖండించారని న్యూయార్క్ టైమ్స్ మీడియా సంస్థ విలేకరి ఒకరు తాజాగా ట్వీట్ చేశారు. భారతీయులను మరో సురక్షితమార్గంలో ఎయిర్‌పోర్టులోపలికి పంపించామని తాలిబన్లు పేర్కొన్నట్టు సదరు విలేకరి తెలిపారు. కాగా.. వీరందరూ ప్రస్తుతం సురక్షితంగానే ఉన్నారని భారత అధికార వర్గాలు పేర్కొన్నాయి. వీరిని స్వదేశానికి తరలించేందుకు ముమ్మర ఏర్పాట్లు జరుగుతున్నాయి. 

Updated Date - 2021-08-21T20:55:52+05:30 IST