కూరగాయలకు ఇబ్బంది రాకుండా 150 మొబైల్‌ రైతుబజార్లు

ABN , First Publish Date - 2020-03-30T21:37:49+05:30 IST

తెలంగాణ లాక్‌డౌన్‌ నేపధ్యంలో సాధారణ ప్రజలు ఇబ్బందులకు గురికాకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటోంది.

కూరగాయలకు ఇబ్బంది రాకుండా 150 మొబైల్‌ రైతుబజార్లు

హైదరాబాద్‌: తెలంగాణ లాక్‌డౌన్‌ నేపధ్యంలో సాధారణ ప్రజలు ఇబ్బందులకు గురికాకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటోంది. ప్రత్యేకించి నిత్యావసర సరుకులు, కూరగాయల విషయంలో ప్రత్యేక దృష్టికేంద్రీకరించింది. తెలంగాణ మార్కెటింగ్‌శాఖ ఈ మేరకు మొబైల్‌రైతుబజార్లను ఏర్పాటు చేసి ప్రజలకు ఇంటి వద్దకే కూరగాయలను అందించాలని నిర్ణయించింది. ఈమేరకు తొలిదశలో గ్రేటర్‌హైదరాబాద్‌పరిధిలోనూ, శివారు ప్రాంతాల్లోనూ కూరగాయలను అందించేందుకు 150 మొబైల్‌ రైతుబజార్లను మార్కెటింగ్‌శాఖ ఏర్పాటుచేసింది. వీటి ద్వారా నేరుగా కాలనీలు, బస్తీలలో ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం 3గంటల వరకూ ఆయా ప్రాంతాల్లోకి మొబైల్‌ రైతుబజార్లు వచ్చి ప్రజలకు కూరగాయలను విక్రయించేలా ఏర్పాట్లు చేశారు. దీని వల్ల మార్టెటక్‌లలో, సంతల్లో జనం గుమిగూడే అవకాశం ఉండదు. బస్తీలు, కాలనీల్లోకి రావడం వల్లస్థానికులు సామాజిక దూరం పాటిస్తూ కూరగాయలను కొనుగోలుచేస్తున్నారు. ఈ ప్రయోగం సక్సెస్‌ అవుతున్నట్టుఅధికారులు కూడా తెలిపారు. రైతులు తీసుకు వచ్చే కూరగాయలను మార్కెట్‌లకు తరలించడంతో పాటు రైతుబజార్ల ద్వారా వారి సరుకులు విక్రయించుకునే ఏర్పాట్లుచేశారు. దీంతో ప్రజలకు తక్కువ ధరలకే కూరగాయలు అందుబాటులోకి వచ్చినట్టుచెబుతున్నారు. దీంతో ధరలు పెంచే పరిస్థితి రాకుండా ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యలకు ప్రజలు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

Updated Date - 2020-03-30T21:37:49+05:30 IST