1500 కోట్లతో ర్యాపిడ్‌ యాక్షన్‌ ఫోర్స్‌

ABN , First Publish Date - 2021-01-17T08:01:14+05:30 IST

దేశ భద్రతను మరింత పటిష్ఠం చేస్తున్నామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా స్పష్టం చేశారు. కర్ణాటకలోని శివమొగ్గ జిల్లా భద్రావతి శివారులో మిలిటరీ క్యాంప్‌లో సీఆర్‌పీఎ్‌ఫకు అనుబంధంగా ర్యాపిడ్‌ యాక్షన్‌ ఫోర్స్‌(

1500 కోట్లతో ర్యాపిడ్‌ యాక్షన్‌ ఫోర్స్‌

 కర్ణాటకలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా 


బెంగళూరు, జనవరి 16(ఆంధ్రజ్యోతి): దేశ భద్రతను మరింత పటిష్ఠం చేస్తున్నామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా స్పష్టం చేశారు. కర్ణాటకలోని శివమొగ్గ జిల్లా భద్రావతి శివారులో మిలిటరీ క్యాంప్‌లో సీఆర్‌పీఎ్‌ఫకు అనుబంధంగా ర్యాపిడ్‌ యాక్షన్‌ ఫోర్స్‌(ఆర్‌ఏఎ్‌ఫ)కు శనివారం ఆయన శంకుస్థాపన చేశారు.


అనంతరం అమిత్‌షా మాట్లాడుతూ భద్రావతిలో 50 ఎకరాల విస్తీర్ణంలో ఆర్‌ఏఎఫ్‌ స్థాపనకు రూ.1500 కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. ఇది 97వ బెటాలియన్‌ అని, నాలుగు రాష్ట్రాలకు సంబంధించి 39 జిల్లాలకు అనుబంధంగా ఇక్కడి ఆర్‌ఏఎఫ్‌ పనిచేస్తుందని తెలిపారు. అమరులైన ఆర్‌ఏఎఫ్‌ యోధుల కుటుంబీకులకు రూ.50 లక్షల పరిహారాన్ని ఇస్తామన్నారు. 

కేంద్రమంత్రి ప్రహ్లాద్‌జోషి, సీఎం యడియూరప్ప, రాష్ట్ర హోంశాఖ మంత్రి బసవరాజ్‌ బొమ్మై, ఉపముఖ్యమంత్రులు అశ్వత్థనారాయణ, గోవింద కారజోళ, మంత్రి ఈశ్వరప్ప పాల్గొన్నారు. 

Updated Date - 2021-01-17T08:01:14+05:30 IST