ఒక్కరోజులో 1534 కరోనా కేసులు

ABN , First Publish Date - 2022-01-24T06:16:22+05:30 IST

కరోనా కల్లోలం సృష్టిస్తోంది. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా 1534 కరోనా కేసులు జిల్లాలో నమోదైనట్టు అధికారులు ఆదివారం వెల్లడించారు.

ఒక్కరోజులో 1534 కరోనా కేసులు

జ్వరాలు, జలుబుతో జనం విలవిల 

ఆస్పత్రులకు క్యూ... కొవిడ్‌  పరీక్షలకు నో

అనంతపురం వైద్యం, జనవరి 23: కరోనా కల్లోలం సృష్టిస్తోంది. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా 1534 కరోనా కేసులు జిల్లాలో నమోదైనట్టు అధికారులు ఆదివారం వెల్లడించారు. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 166657కి చేరింది. ఇందులో 158996 మంది ఆరోగ్యంగా కోలుకున్నారు. ఇప్పటిదాకా 1093 మంది మరణించారు. ప్రస్తుతం 6568 మంది చికిత్స పొందుతున్నట్లు అధికారులు తెలిపా రు. వైరస్‌ విజృంభణతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. జిల్లా కేంద్రంతో పాటు మున్సిపాలిటీలు, మండలాలు, పల్లెల్లో ఎక్కడ చూసినా జనం జ్వరాలు, జలుబు, ఒళ్లు నొప్పులతో బాధపడుతున్నారు. జిల్లా ఆస్పత్రితో పాటు జిల్లాలోని ఇతర ప్రభుత్వ ఆస్పత్రులు, ప్రైవేట్‌ ఆస్పత్రులు ఈ జ్వర, జలుబు బాధితులతో కిటకిటలాడుతున్నాయి. ప్రధానంగా గ్రామీణ ప్రజలు జ్వరాలు, జలుబు విషయంలో చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. కేవలం జ్వరం, జలుబు అంటూ ఆస్పత్రులకు చికిత్స కోసం వచ్చి వెళ్తున్నారు. అక్కడ కరోనా పరీక్షలు చేయించుకోమంటే ససేమిరా అంటున్నారని డాక్టర్లు చెబుతున్నారు. రాయదుర్గం, కళ్యాణదుర్గం, శింగనమల, మడకశిర, ఉరవకొండ, హిందూపురం, పెనుకొండ, కదిరి నియోజకవర్గాల్లో ఈ పరిస్థితి అధికంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. కొవిడ్‌ పరీక్షలు చేయించుకోకుండా యథేచ్ఛగా తిరుగుతున్నారు. కొవిడ్‌ నిబంధనలు పాటించడం లేదు. మాస్క్‌లు లేకుండానే రోడ్లు వెంబడి రాకపోకలు చేస్తున్నారు.  గుంపులుగా ఉంటున్నారు. దీంతో  ఇతరులకు కరోనా వైరస్‌ వెంటనే సోకుతున్నట్లు వైద్యవర్గాలు చెబుతున్నా యి. అధికారులు, వైద్యులు సైతం కరోనా కేసుల పెరుగుదలను చూసి ఆందోళన చెందుతున్నారు. బాధితు లకు పెద్దప్రమాదం ఏర్పడకపోవడం, మరణాల సంఖ్య కనిపించకపోవడంతో కొంత ఊరటనిస్తోంది. 


కేజీబీవీలో 19 మందికి కరోనా

ఉరవకొండ: పట్టణంలోని కస్తూర్బా పాఠశాలలో 19 మందికి కరోనా సోకింది. మూడు రోజుల క్రితం ఈ విద్యాలయంలో ఓ విద్యార్థికి కరోనా నిర్ధారణ కాగా, 34 మంది విద్యార్ధులకు పరీక్షలు నిర్వహించారు. వీరిలో 11 మంది విద్యార్థులు, 9 మంది ఉపాధ్యాయులకు కరోనా సోకింది. దీంతో పాఠశాల కు మూడురోజులు సెలవు ప్రకటించారు. అలాగే పట్టణ, గ్రామాల్లో విషజ్వరాలు పెరుగుతున్నాయి.  

Updated Date - 2022-01-24T06:16:22+05:30 IST