శ్రీశైలం డ్యాంలో 157 టీఎంసీలు

ABN , First Publish Date - 2021-09-07T01:30:57+05:30 IST

కృష్ణానదికి ఎగువ పరివాహక ప్రాంతం నుంచి వరద ప్రవాహం పెరగడంతో శ్రీశైలం డ్యాంకు ఇన్‌ఫ్లో పెరుగుతోంది. జూరాల ప్రాజెక్టు గేట్ల ద్వారా 1,10,660 క్యూసెక్కులు

శ్రీశైలం డ్యాంలో 157 టీఎంసీలు

శ్రీశైలం: కృష్ణానదికి ఎగువ పరివాహక ప్రాంతం నుంచి వరద ప్రవాహం పెరగడంతో శ్రీశైలం డ్యాంకు ఇన్‌ఫ్లో పెరుగుతోంది. జూరాల ప్రాజెక్టు గేట్ల ద్వారా 1,10,660 క్యూసెక్కులు, విద్యుదుత్పాదన ద్వారా 29,769 క్యూసెక్కులు, సుంకేసుల నుంచి 12,831 క్యూసెక్కులతో కలిపి మెత్తంగా 1,53,260 దిగువకు వస్తుండగా, శ్రీశైలం డ్యాంలోకి 47,069 క్యూసెక్కుల నీరు చేరుతోంది. సోమవారం సాయంత్రానికి శ్రీశైలం డ్యాం నీటిమట్ట 885 అడుగులకు గాను 873.70 అడుగులు కాగా, 215.807 టీఎంసీలకు గాను 157.5068 టీఎంసీల నీటి నిల్వ ఉన్నది. ఎడమ గట్టు జలవిద్యుత్‌ కేంద్రంలో 25,247 క్యూసెక్కుల నీటిని ఉపయోగించి విద్యుదుత్పాదన చేస్తున్నట్లు డ్యాం గేజింగ్‌ అధికారలు తెలిపారు. సాగర్‌కు 25,247 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు.

Updated Date - 2021-09-07T01:30:57+05:30 IST