స్నేహితుడు జరిపిన కాల్పుల్లో 13 ఏళ్ల కుర్రాడు మృతి

ABN , First Publish Date - 2021-07-20T02:31:37+05:30 IST

అగ్రరాజ్యం అమెరికాలో దారుణం జరిగింది. తుపాకీ తూటాకు 13ఏళ్ల బాలుడు బలైపోయిన ఘటన ఉతాహ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. సాల్ట్ లేక్ సిటీ ప్రాంతంలో నివసిస్తున్న ఇ

స్నేహితుడు జరిపిన కాల్పుల్లో 13 ఏళ్ల కుర్రాడు మృతి

వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో దారుణం జరిగింది. తుపాకీ తూటాకు 13ఏళ్ల బాలుడు బలైపోయిన ఘటన ఉతాహ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. సాల్ట్ లేక్ సిటీ ప్రాంతంలో నివసిస్తున్న ఇద్దరు స్నేహితులు ఆడుకోవడానికి దగ్గర్లోని చర్చ్ పార్కింగ్‌ లాట్‌లోకి వెళ్లారు. ఈ క్రమంలో 15 సంవత్సరాలున్న కుర్రాడు తుపాకీ తీసుకుని, 13ఏళ్ల అబ్బాయిపై కాల్పులు జరిపాడు. దీంతో 13ఏళ్ల టీనేజర్ శరీరంలోకి బులెట్లు దూసుకెళ్లాయి. తీవ్ర రక్తస్రావంతో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న తన స్నేహిడిని చూసి, 15ఏళ్ల అబ్బాయి కంగారుపడ్డాడు. ఈ క్రమంలోనే 911కు ఫోన్ చేసి, సమాచారం అందించాడు. దీంతో అక్కడకు చేరుకున్న పోలీసులు.. 13ఏళ్ల కుర్రాడు చినిపోయినట్టు నిర్ధారించారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ.. గన్ లోడై ఉన్నట్టు తెలియకుండానే.. 15ఏళ్ల కుర్రాడు తన స్నేహితుడిపై కాల్పులు జరిపినట్టు తెలిపారు. ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న స్నేహితుడిని చూసి, అతడే తమకు ఫోన్ చేసినట్టు చెప్పారు. అంతేకాకుండా 15ఏళ్ల కుర్రాడిని అరెస్టు చేసి, జువనైల్ కేంద్రానికి తరలించినట్టు చెప్పారు. 


Updated Date - 2021-07-20T02:31:37+05:30 IST