Abn logo
Sep 4 2021 @ 07:41AM

HYD : గుట్టు చప్పుడు కాకుండా వ్యభిచారం.. 9 మంది యువతుల అరెస్ట్

హైదరాబాద్ సిటీ/మాదాపూర్‌ : గుట్టు చప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్న నిర్వాహకులతో పాటు మొత్తం 16 మందిని మాదాపూర్‌ ఎస్‌వోటీ పోలీసులు అరెస్ట్‌ చేశారు. సనత్‌నగర్‌కు చెందిన ప్రధాన నిర్వాహకుడు టంకా సతీష్‌కుమార్‌ సైబర్‌హిల్స్‌ కాలనీలో మాదాపూర్‌లో ఎంజెలీ బ్యూటీ ఫ్యామిలీ సెలూన్‌ నిర్వహిస్తున్నాడు. దాని ముసుగులో గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్నాడు. సమాచారం అందుకున్న ఎస్‌వోటీ పోలీసులు శుక్రవారం రాత్రి సెలూన్‌పై దాడి చేసి నలుగురు నిర్వాహకులతో తొమ్మిది మంది యువతులు, ముగ్గురు కస్టమర్లను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 21 సెల్‌ఫోన్లు, రూ. 17.500 నగదు, ఒక కారు స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకు ఖాతాలో ఉన్న 13,24,182 రూపాయలు సీజ్‌ చేశారు. తదుపరి విచారణ కోసం నిందితులతో పాటు స్వాధీనం చేసుకున్న సామగ్రిని మాదాపూర్‌ పోలీసులకు అప్పగించారు.