మామిడాడలో ఆగని కేసుల ఉధృతి

ABN , First Publish Date - 2020-05-31T10:06:29+05:30 IST

జీ.మామిడాడను కరోనా వెంటాడుతూనే ఉంది. శనివారం మరో 16 కేసులు నమోదుకావడంతో ప్రజలు ఆందోళన

మామిడాడలో ఆగని కేసుల ఉధృతి

పెదపూడి, మే 30 : జీ.మామిడాడను కరోనా వెంటాడుతూనే ఉంది. శనివారం మరో 16 కేసులు నమోదుకావడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వీటితో జీ.మామిడా డలో మొత్తం 99 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. జేసీ చేకూరి కీర్తి, ఎమ్మెల్యే డాక్టర్‌ సత్తి సూర్యనారాయణరెడ్డిలు గ్రామంలోని కంట్రోల్‌ రూంను సందర్శించారు. అక్కడ నియమించిన అధికారులతో స్థానిక పరిస్థితులపై సమీక్షించి కరోనా నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు సూచనలు చేశారు. అధికారులు అప్రమత్తంగా ఉండా లని ఎప్పటికప్పుడు పరిస్థితులు సమీక్షించాలని సూచించారు. ప్రజలు కూడా అధికారు లకు సహకరిస్తూ వారి సూచనలు, సలహాలను పాటించాలన్నారు.


ఈ సమీక్షలో ఆర్డీవో చిన్ని కృష్ణ, కంట్రోల్‌ రూం నోడల్‌ అధికారి పుష్పమణి, ఎంపీడీవో పీ విజయభాస్కర్‌, తహశీల్దారు కే రాజ్యలక్ష్మి, డీఎస్పీ వి.భీమారావు, కాకినాడ రూరల్‌ సీఐ ఆకుల మురళీ కృష్ణ, ఎస్‌ఐ లక్ష్మి, పెద్దాడ పీహెచ్‌సీ వైద్యురాలు డాక్టర్‌ ప్రియాంక పాల్గొన్నారు. కాగా జీ.మామిడాడను వెంటాడుతున్న పాజిటివ్‌ కేసుల వల్ల ఇక్కడి ప్రజలకు పొరుగు గ్రామాల్లో చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. ఏదైనా పని నిమిత్తం ఎక్కడికి వెళ్లినా గ్రామం పేరు చెప్పగానే ఎదుటివాళ్లు దూరం పెట్టే పరిస్థితి కనిపిస్తోంది. ఒక్క పక్క రోగితో కాదు కరోనాతో పోరాటం అంటూ పెద్దఎత్తున ప్రచారం సాగుతున్నా మా మిడాడ గ్రామవాసులంటే అవమానాలు చవిచూస్తున్నామని వారు వాపోతున్నారు.

Updated Date - 2020-05-31T10:06:29+05:30 IST