Abn logo
Sep 27 2021 @ 00:46AM

మత్స్యకారుల వలకు చిక్కిన 16 కిలోల చేప

పట్టుబడిన చేపను చూపుతున్న యువకులు

 

నక్కపల్లి, సెప్టెంబరు 26 : మండలంలోని రాజయ్యపేట సముద్రతీరంలో వేటకు వెళ్లిన మత్స్యకారులకు పెద్ద చేప చిక్కింది. దీంతో వారి ఆనందానికి అవధులు లేకపో యాయి. యజ్జల దుర్గాలు తదితరులు శనివారం బోటుపై సముద్రంలో వేటకు వెళ్లారు. ఒడ్డుకు వచ్చేసరికి బరువైపు చేప వలకు చిక్కింది. సుమారు పదహారు కిలోల బరువు వున్న ఈ చేప పేరు నల్లమట్టగా స్థానిక మత్స్యకారులు తెలిపారు. దీనిని ఐదు వేల రూపాయలకు అక్కడే వున్న మత్స్యకార యువకులు ఆదివారం కొనుగోలు చేశారు. బయట మార్కెట్లో  ఈ చేప ఖరీదు చాలా ఎక్కువగా ఉంటుందని వారు చెప్పారు. ఈ చేపను అక్కడ ఉన్నవారంతా ఆసక్తికరంగా తిలచించారు.