16 నుంచి రెండో విడత పాఠ్యపుస్తకాల సరఫరా

ABN , First Publish Date - 2020-08-14T09:55:54+05:30 IST

మండల కేంద్రాలకు ఈ నెల 16 నుంచి 27వ తేదీ వరకు రెండో విడత ఉచిత పాఠ్యపుస్తకాలు సరఫరా చేస్తున్నట్లు డీఈవో సాయిరాం గురువారం

16 నుంచి రెండో విడత పాఠ్యపుస్తకాల సరఫరా

కర్నూలు(ఎడ్యుకేషన్‌), ఆగస్టు 13: మండల కేంద్రాలకు ఈ నెల 16 నుంచి 27వ తేదీ వరకు రెండో విడత ఉచిత పాఠ్యపుస్తకాలు సరఫరా చేస్తున్నట్లు డీఈవో సాయిరాం గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాకు 15 లక్షల పాఠ్య పుస్తకాలు రావాల్సి ఉండగా.. 10 లక్షల పుస్తకాలు వచ్చాయన్నారు. మిగిలినవి త్వరలో వస్తాయన్నారు.


ఈ నెల 16న కర్నూలు, కల్లూరు, 17న ఎమ్మిగనూరు, ఆదోని, పెద్దకడుబూరు, 18న కోడుమూరు, దేవనకొండ, పత్తికొండ, మద్దికెర, తుగ్గలి, 19న గూడూరు, సి.బెళగల్‌, నందవరం, మంత్రాలయం, కోసిగి, 20న గోనెగండ్ల, ఆలూరు, ఆస్పరి, చిప్పగిరి, హోళగుంద, 21న కౌతాళం, హాలహర్వి, గడివేముల, పగిడ్యాల, మిడ్తూరు, 22న జూపాడుబంగ్లా, పాములపాడు, ఆత్మకూరు, శ్రీశైలం, 23న వెలుగోడు, బండిఆత్మకూరు, మహానంది, నంద్యాల, చాగలమర్రి, 24న ఓర్వకల్లు, పాణ్యం, శిరివెళ్ల, గోస్పాడు, రుద్రవరం, ఆళగడ్డ, 25న నందికొట్కూరు, డోన్‌, క్రిష్ణగిరి, ప్యాపిలి, వెల్దుర్తి, 26న బేతంచెర్ల, బనగానపల్లె, అవుకు, కొలిమిగుండ్ల, 27న కోవెలకుంట్ల, సంజామల, ఉయ్యాలవాడ, దొర్నిపాడు మండలాలకు పుస్తకాలు పంపిణీ చేస్తామని తెలిపారు. ఆయా మండలాల విద్యాశాఖ అదికారులు పుస్తకాలను తీసుకుని ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని సూచించారు.

Updated Date - 2020-08-14T09:55:54+05:30 IST