16 ఏళ్ల కూతురి గదిలోంచి వినిపించిన ఏడుపు.. కంగారుగా ఆ తల్లి వెళ్లి ఏమైందమ్మా అని అడిగితే ఆమె చెప్పింది విని..

ABN , First Publish Date - 2021-11-20T17:57:48+05:30 IST

బాలిక ఇంటి నుంచి బయటకు రావడం మానేసింది. గదిలో ఒంటరిగా కూర్చుని ఏడవడం ప్రారంభించింది.

16 ఏళ్ల కూతురి గదిలోంచి వినిపించిన ఏడుపు.. కంగారుగా ఆ తల్లి వెళ్లి ఏమైందమ్మా అని అడిగితే ఆమె చెప్పింది విని..

ఆ బాలిక వయసు 16 సంవత్సరాలు.. ఇంటర్మీడియెట్ చదువుతోంది.. ఆమెతో పాటే చదువుతున్న ఇద్దరు యువకులు ఆమె వెంట పడుతున్నారు.. ఆ బాలిక పట్టించుకోకపోవడంతో వారు దారుణ ప్లాన్ వేశారు.. ఆమె ఫొటోలను అసభ్యకరంగా మార్చి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు.. అందుకోసం ఫేక్ ఐడీలతో ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లు ఓపెన్ చేశారు.. ఆ ఫొటోలు చూపించి ఆ బాలికపై బెదిరింపులకు దిగారు.. దీంతో ఆ బాలిక ఆత్మహత్యాయత్నం చేసింది. రాజస్థాన్‌లోని నాగౌర్‌లో ఈ ఘటన జరిగింది. 


రాజస్థాన్‌లోని నాగౌర్‌కు చెందిన బాధిత బాలిక స్థానిక కళాశాలలో ఇంటర్మీడియెట్ చదువుతోంది. ఆమెతో పాటే చదువుతున్న ఇద్దరు యువకులు ఆ బాలికను వేధించడం ప్రారంభించారు. ఆమె ఫొటోలను అసభ్యకరంగా మార్చి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. అందుకోసం ఫేక్ ఐడీలతో ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లు ఓపెన్ చేశారు. ఆ ఫొటోలు చూపించి ఆ బాలికపై బెదిరింపులకు దిగారు. తాము చెప్పినట్టు చేయమని ఒత్తిడి చేశారు. దీంతో మనస్థాపానికి గురైన బాలిక ఇంటి నుంచి బయటకు రావడం మానేసింది. గదిలో ఒంటరిగా కూర్చుని ఏడవడం ప్రారంభించింది. 


బాలిక ఏడుపు విన్న తల్లి ఏం జరిగిందని ఆరా తీసింది. తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్టు చెప్పిన బాలికను వారించే ప్రయత్నం చేసింది. ఇరుగు పొరుగు వారిని పిలిచి కూతుర్ని రక్షించుకుంది. అనంతరం ఆమె చెప్పింది విని స్థానిక పోలీస్ స్టేషన్‌కు వెళ్లింది. తన కూతురిని వేధిస్తున్న వారిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు.

Updated Date - 2021-11-20T17:57:48+05:30 IST