160 బస్తాల రేషన్‌ బియ్యం పట్టివేత

ABN , First Publish Date - 2022-01-22T04:32:42+05:30 IST

అనుమతులు లేకుం డా అక్రమంగా రేషన్‌ బి య్యం తరలిస్తున్న రెం డు వాహనాలను ఎన్‌ఫోర్సుమెంట్‌ అధికారు లు పట్టుకున్నారు.

160 బస్తాల రేషన్‌ బియ్యం పట్టివేత
పట్టుబడిన రేషన్‌ బియ్యం లోడు లారీ

గుడ్లూరు, జనవరి 21 : అనుమతులు లేకుం డా అక్రమంగా రేషన్‌ బి య్యం తరలిస్తున్న రెం డు వాహనాలను ఎన్‌ఫోర్సుమెంట్‌ అధికారు లు పట్టుకున్నారు. ఈ ఘటన మండలంలోని నరసాపురంలో వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుడ్లూరు మండలం దారకానిపాడుకు చెంది న పి.మల్లికార్జునకు సంబంధించిన బోలేరో వాహనం, అలాగే నెల్లూరు జిల్లా దగదర్తి ప్రాంతానికి చెందిన ఆదిశేషుకు సంబంధించిన మినీలారీలో రేషన్‌ బియ్యం తరలిస్తున్నట్లు సమాచారం అందింది. తనిఖీ చేయడంతో బోలేరో వాహనంలో 60 బస్తాలు, మినీలారీలో 100 బస్తాల రేషన్‌బియ్యం పట్టుబడినట్లు కందుకూరు ఎన్‌ఫోర్సుమెంట్‌ డీటీ నాయబ్‌రసూల్‌ శుక్రవారం తెలిపారు. ఈ సరుకు కావలికి తరలిపోతుందన్నారు. పట్టుబడిన రెండు వాహనాల డ్రైవర్లు మల్లికార్జున, ఆదిశేషులను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసినట్లు తెలిపారు.


ఇద్దరిపై 6ఏ కేసుల నమోదు

ఎర్రగొండపాలెం, జనవరి 21 : ఎర్రగొండపాలెంలోని 22వ రేషన్‌షాపును తహసీల్దారు వీరయ్య తనిఖీ చేశారు. స్టాకు రిజిస్టర్‌లో నమోదు చేసి న నిల్వలకు, షాపులో ఉన్న నిల్వలకు తేడా ఉండడంతో డీలరుపై 6ఏ కే సు నమోదు చేశారు. అలాగే ఎర్రగొండపాలెంలో వై. రాంబాబు అనే వ్యక్తి 8.50 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం అక్రమంగా నిల్వఉంచడంతో సీజ్‌చేశారు. ఆయనపై 6ఏ కేసు నమోదుచేసినట్లు తహసీల్దారు శుక్రవారం తెలిపారు.

Updated Date - 2022-01-22T04:32:42+05:30 IST