Abn logo
Sep 23 2021 @ 01:45AM

166 కొవిడ్‌ పాజిటివ్‌లు

మూడు బ్లాక్‌ ఫంగస్‌ కేసులు 

ఒంగోలు (కార్పొరేషన్‌), సెప్టెంబరు 22 : జిల్లాలో బుధవారం కొత్తగా 166 కొవిడ్‌ పాజిటివ్‌లు నమోదయ్యాయి. గడిచిన ఇరవై నాలుగు గంటల్లో ఒక్క మరణం కూడా నమోదు కాలేదు. ప్రస్తుతం 2,331 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఇదిలా ఉండగా కొత్తగా మరో మూడు బ్లాక్‌ ఫంగస్‌ కేసులు వెలుగు చూశాయి. గడిచిన మూడు నెలల్లో 307 బ్లాక్‌ఫంగస్‌ కేసులు గుర్తించగా,157 మందికి శస్త్రచికిత్సలు నిర్వహించారు. 201మంది కోలుకుని డిశ్చార్జ్‌ కాగా 18మంది మరణించారు. ప్రస్తుతం రిమ్స్‌లో 22మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. మిగిలిన వారు వివిధ ప్రైవేటు ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకున్నారు. మరోవైపు బుధవారం జిల్లాలోని 40 కేంద్రాల్లో 8,031 మందికి కరోనా టీకాలు వేశారు.