Advertisement
Advertisement
Abn logo
Advertisement

వైరల్ వీడియో.. 17ఏళ్ల యువతి సాహసానికి నెటిజన్లు ఫిదా!

వాషింగ్టన్: పెంపుడు కుక్కల కోసం ఓ యువతి భారీ సాహసం చేసింది. ప్రాణాలను పణంగా పెట్టి, శునకాలను రక్షించింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. కాలిఫోర్నియాకు చెందిన ఓ యువతి కొన్ని శునకాలను పెంచుకుంటోంది. ఈ క్రమంలో ఎక్కడి నుంచి వచ్చిందో కానీ ఓ భారీ ఎలుగుబంటి ఆ యువతి ఇంటి ఆవరణలోకి ప్రవేశించింది. ప్రహారీ గోడపై ఎలుగుబంటిని చూసి, శునకాలు అరవడం ప్రారంభిచాయి. దీంతో ఆ ఎలగుబంటి వాటిపై దాడి చేయడానికి ప్రయత్నించింది. కాగా.. కుక్కల అరుపులతో ఇంటి నుంచి బయటికొచ్చిన 17 ఏళ్ల యువతి ఎలుగుబంటిని చూసి ఒక్కసారిగా షాకైంది. ఈ క్రమంలోనే శునకాలను రక్షించేందుకు ప్రహారీ గోడ వద్దకు పరుగెత్తుకెళ్లి, ఎలుగుబంటిని గోడపై నుంచి బలంగా కిందికి తోసేసింది. అది మళ్లీ గోడెక్కేలోపు శుకనాలకు చేతిలో పట్టుకుని ఇంట్లోకి పరుగులు తీసింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు అక్కడ ఉన్న సీసీకెమెరాలో రికార్డు అవ్వగా.. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో స్పందిస్తున్న నెటిజన్లు.. యువతి ధైర్యసాహసాలపట్ల ప్రశంసలు కురిపిస్తున్నారు. Advertisement

అమెరికా నగరాల్లోమరిన్ని...

Advertisement