17ఏళ్ల అమ్మాయి.. పుట్టెడు దుఃఖంలోనూ పరీక్షల్లో టాప్

ABN , First Publish Date - 2021-07-31T04:46:14+05:30 IST

తల్లిదండ్రులను కోల్పోయింది. తాతయ్యలు, అమమ్మలు, మామయ్యలను పోగొట్టుకుంది. ఒక్కగానొక్క చెల్లి ఈ లోకం..

17ఏళ్ల అమ్మాయి.. పుట్టెడు దుఃఖంలోనూ పరీక్షల్లో టాప్

తల్లిదండ్రులను కోల్పోయింది. తాతయ్యలు, అమమ్మలు, మామయ్యలను పోగొట్టుకుంది. ఒక్కగానొక్క చెల్లి ఈ లోకం నుంచి వెళ్లిపోయింది. మొత్తం 24 మంది కుటుంబ సభ్యులు ఒక్కసారిగా ఈ మధ్యనే కోల్పోయింది.  17ఏళ్ల జీ గోపిక అనే కేరళకు చెందిన అమ్మాయి దీన గాధ ఇది. ఒక్కసారిగా జీవితం మొత్తం అంధకారంలోకి వెళ్లిపోయింది. కానీ తల్లిదండ్రుల కోసం ప్లస్ టూ పరీక్షల్లో ఏ+ గ్రేడ్‌లో పాసై వారికిచ్చిన మాట నిలబెట్టింది.


గోపిక తల్లిదండ్రులతో పాటు 22 మంది కుటుంబ సభ్యులు ఈ మధ్యనే ప్రాణాలు కోల్పోయారు. కేరళలో ఇటీవల విరిగిపడిన కొండచరియల నేపథ్యంలో వారందరి ఇళ్లు ధ్వంసమైపోయాయి. ఆ ఇళ్లలో ఉన్న వారి కూడా ఏం జరుగుతుందో అర్థమయ్యేలోపే అనంతవాయువుల్లో కలిసిపోయాయి. ఈ దుర్ఘటన జరిగినప్పుడు గోపిక తన బంధువుల ఇంట్లో ఉంది. అక్కడి నుంచే తన ప్లస్ టూ పరీక్షల కోసం సన్నద్ధమవుతోంది. కానీ తల్లిదండ్రులు, బంధువులూ అంతా ఒక్కసారిగా చనిపోయారని తెలియడంతో ఆమె గుండెపగిలేలా ఏడ్చింది. జీవితం మొత్తం అంధకారంగా మారిందని బాధపడింది. 


కానీ తనను తాను ఓదార్చుకుని తల్లిదండ్రులకిచ్చిన మాట మేరకు కష్టపడి చదివి ప్లస్‌ టూ పరీక్షల్లో ఏ+ ర్యాంక్ సాధించింది. ఈ ర్యాంక్ సాధింవచడంపై ఆమె మాట్లాడుతూ.. ‘నాకు తెలుసు.. అమ్మ, నాన్న నన్ను ఆనందంగా చూస్తున్నారని. నేనే ప్లస్ టూ మంచి మార్కులతో పాసవ్వాలని అమ్మ, నాన్న ఎంతో ఆశపడ్డారు. ఇప్పుడు నేను అధి సాధించారు. కానీ అది దగ్గరుండి చూసేందుకు వారిద్దరూ లేరు..’ అంటూ ఆవేదన నిండిన కంఠంతో ఆమె చెప్పుకొచ్చింది.

Updated Date - 2021-07-31T04:46:14+05:30 IST