Advertisement
Advertisement
Abn logo
Advertisement

రాత్రి అందరూ పడుకునే టైమ్‌కు 17ఏళ్ల అమ్మాయి చేసిన పనికి నివ్వెర పోయిన కుటుంబ సభ్యులు.. తమకే ఇలా ఎందుకంటూ..

ఇంటర్నెట్ డెస్క్: కుటుంబ సభ్యులు అందరూ కలిసి రాత్రి భోజనం చేశారు. ఆ తర్వాత నిద్ర పోవడానికి.. ఎవరి గదుల్లోకి వారు వెళ్లిపోయారు. ఈ క్రమంలోనే 17ఏళ్ల అమ్మాయి కూడా తన గదికి వెళ్లింది. ఆ తర్వాత దారుణానికి పాల్పడింది. అదికాస్తా.. కుటుంబ సభ్యుల కంటపడటంతో వారు నివ్వెర పోయారు. కాగా.. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..


రాజస్థాన్‌లోని బికనీర్ ప్రాంతానికి చెందిన దీపారామ్‌కు ముగ్గురు పిల్లలు. ఇందులో రేఖ అనే అమ్మాయికి పెద్దమ్మాయి.. కాగా ఆమెకు ప్రస్తుతం 17ఏళ్లు. ఇంటి దగ్గరే ఉంటూ ఎలక్ట్రిక్ షాపును నడుపోంది. ఈ క్రమంలోనే శనివారం రోజు ఎప్పటిలాగే రేఖ షాప్ ఓపెన్ చేసి, సాయంత్రానికి తిరిగొచ్చింది. ఆ తర్వాత కుటుంబ సభ్యులతో కబుర్లు చెపుతూ సంతోషంగా గడిపింది. ఈ నేపథ్యంలోనే రాత్రి.. అందరూ కలిసి భోజనం చేశారు. అనంతరం పడుకోవడానికి ఎవరి గదుల్లోకి వారు వెళ్లారు. ఈ సమయంలోనే రేఖ.. దారుణానికి పాల్పడింది. తన గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించింది. 


అయితే.. దీన్ని కుటుంబ సభ్యులు గుర్తించి, వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. అక్కడ రేఖను పరిశీలించిన వైద్యులు.. తాను అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడించారు. దీంతో తమకే ఇలా ఎందుకు జరుగుతోంది అంటూ కుటుంబ సభ్యలు శోకసంద్రంలో మునిగిపోయారు. ఇదిలా ఉంటే.. గత ఏడాది రేఖ సోదరి కూడా ఆత్మహత్య చేసుకుని చనిపోగా.. ఆమె సోదరుడు కూడా అనుమానాస్పదంగా మృతి చెందాడు. అంతేకాకుండా కొన్ని సంవత్సరాలుగా క్యాన్సర్‌తో బాధపడుతున్న రేఖ తల్లి.. కొన్ని నెలల క్రితమే ప్రాణాలు విడిచారు. ఏడాదినరలో నలుగురుని కోల్పోవడంతో ఆ కుటంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.ఇవి కూడా చదవండిImage Caption

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement