172 మంది గ‌ర్భిణు‌ల‌కు డెలివ‌రీ... 44 మంది శిశువులకు పాజిటివ్ రిపోర్టు!

ABN , First Publish Date - 2020-05-31T15:21:59+05:30 IST

గుజ‌రాత్‌లోని అహ్మదాబాద్‌కు చెందిన ప‌లువురు గర్భిణుల‌కు ప్రసవానికి ముందు నిర్వ‌హించిన వైద్య‌పరీక్షలలో కరోనా పాజిటివ్ అని తేల‌డంతో వారితోపాటు వైద్యాధికారులు షాక్ అయ్యారు.

172 మంది గ‌ర్భిణు‌ల‌కు డెలివ‌రీ... 44 మంది శిశువులకు పాజిటివ్ రిపోర్టు!

అహ్మదాబాద్: గుజ‌రాత్‌లోని అహ్మదాబాద్‌కు చెందిన ప‌లువురు గర్భిణుల‌కు ప్రసవానికి ముందు నిర్వ‌హించిన వైద్య‌పరీక్షలలో కరోనా పాజిటివ్ అని తేల‌డంతో వారితోపాటు వైద్యాధికారులు షాక్ అయ్యారు. ఈ 172 మంది గ‌ర్భిణుల‌కు అహ్మ‌దాబాద్‌లోని సివిల్ ఆసుప‌త్రి, ఎస్వీపీ, సోలా సివిల్, శారదాబెన్ ఎల్‌జీ ఆసు‌ప‌త్రుల‌లో డెలివ‌రీ జ‌రిగింది. ఈ నేప‌ధ్యంలో 44 మంది న‌వ‌జాత శిశువుల‌కు క‌రోనా సోకిన‌ట్లు తేలింది. ఈ సందర్భంగా సివిల్ ఆసుప‌త్రికి చెందిన గైనకాలజీ, ప్రసూతి విభాగం ప్రధాన వైద్యులు అమీ మెహతా మాట్లాడుతూ కరోనా సోకిన గ‌ర్భిణుల‌తో సహా ఇత‌ర గ‌ర్భిణులు గత రెండు నెలల్లో 90 మంది శిశువుల‌కు జ‌న్మ‌నిచ్చార‌ని గణాంకాలు చెబుతున్నాయ‌న్నారు. అయితే ఈ శిశువుల‌లో 30 శాతం మంది పాజిటివ్‌గా తేలార‌న్నారు. అదేవిధంగా 70 కరోనా పాజిటివ్ గ‌ర్భిణులు ఎస్వీపీ ఆసుపత్రిలో ప్రసవించ‌గా, వీరిలో 15 మంది శిశువులు కరోనా పాజిటివ్‌గా ఉన్నట్లు తేలింది. డెలివ‌రీకి వ‌చ్చిన మ‌హిళ‌లు 20 నుండి 30 సంవత్సరాల మధ్య వయస్సులో ఉన్నారని, వారిలో క‌రోనా వ్యాధి ల‌క్ష‌ణాలు బ‌య‌ట‌ప‌డ‌లేద‌ని నిపుణులు చెబుతున్నారు. 

Updated Date - 2020-05-31T15:21:59+05:30 IST