17.46 శాతం కొవిడ్‌ పాజిటివిటీ

ABN , First Publish Date - 2022-01-25T04:06:48+05:30 IST

17.46 శాతం కొవిడ్‌ పాజిటివిటీ

17.46 శాతం కొవిడ్‌ పాజిటివిటీ
పరిగి మండలం చిట్యాల్‌లో ఇంటింటి సర్వేలో కలెక్టర్‌ నిఖిల

వికారాబాద్‌/మేడ్చల్‌, జనవరి 24 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : జిల్లాలో కొవిడ్‌ పాజిటివిటీ 17.46 శాతంగా నమోదైంది. సోమవారం 1683 మందికి కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా వారిలో 294 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. తాండూరు నియోజకవర్గం పరిధిలో 521 మందికి కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, వారిలో 106 మందికి పాజిటివ్‌ వచ్చింది. తాండూరులో 289 మందికి పరీక్షలు నిర్వహించగా, వారిలో 76 మందికి పాజిటివ్‌గా నిర్ధారించారు. పెద్దేముల్‌లో 15, యాలాల్‌లో 9, నవాల్గలో 4, జిన్‌గుర్తిలో 2 కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వికారాబాద్‌ నియోజకవర్గం పరిధిలో 558 మందికి పరీక్షలు నిర్వహించగా, వారిలో 78 మందికి కొవిడ్‌ పాజిటివ్‌ వచ్చింది. వికారాబాద్‌ పరిధిలో రామయ్యగూడ, సిద్దులూరులో 262 మందికి పరీక్షలు నిర్వహించగా, వారిలో 48 మందికి పాజిటివ్‌ సోకినట్లు గుర్తించారు. మర్పల్లిలో 21, ధారూరులో 5, నవాబ్‌పేట్‌లో 2, బంట్వారంలో 2 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. పరిగి నియోజకవర్గం పరిధిలో 334 మందికి పరీక్షలు నిర్వహించగా, వారిలో 79 మందికి పాజిటివ్‌ వచ్చింది. పరిగిలో 38, దోమలో 17, కులకచర్లలో 17, చెన్‌గోముల్‌లో 4, పూడూరులో 3 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కొడంగల్‌ నియోజకవర్గం పరిధిలో 270 మందికి పరీక్షలు చేయగా, వారిలో 31 మందికి కొవిడ్‌ పాజిటివ్‌ వచ్చింది. బొంరాస్‌పేట్‌లో 10, కొడంగల్‌లో 7, అంగడి రాయిచూర్‌లో 7, దౌల్తాబాద్‌లో 7 పాజిటివ్‌ కేసులను గుర్తించారు. 

1,26,199 గృహాల్లో ఫీవర్‌ సర్వే పూర్తి... 

వికారాబాద్‌ జిల్లాలో సోమవారం వరకు 1,26,199 గృహాల్లో ఫీవర్‌ సర్వే పూర్తి చేశారు. ఈ సర్వేలో 5541 మందికి అనుమానిత లక్షణాలు ఉన్నట్లు గుర్తించగా, వారిలో 5,461 మందికి పీసీఎం, సీపీఎం, బీ కాంప్లెక్స్‌, విటమిన్‌ సీ ట్యాబ్లెట్లు పంపిణీ చేశారు. కాగా, అనుమానిత లక్షణాలు తీవ్రంగా ఉన్న 2,441 మందికి కొవిడ్‌ పరీక్షలు నిర్వహించగా, వారిలో 232 మందికి కొవిడ్‌ పాజిటివ్‌ ఉన్నట్లు తేలింది.  కాగా మేడ్చల్‌ జిల్లాలో నిర్వహించిన ఫీవర్‌ సర్వే నాలుగు రోజుల్లో 2,83,072 ఇళ్లలో  నివసిస్తున్న వారి సమాచారం సేకరించారు. అందులో 12,419 మందికి  మెడికల్‌ కిట్లను అందజేశారు. సోమవారం  84,792 గృహాల్లో సర్వే చేశారు. 3,044 మందికి హోం ఐసోలేషన్‌ కిట్లను అందజేశారు  గ్రామ పంచాయతీల పరిధిల్లో 4,572 గృహాల్లో సర్వే నిర్వహించి 73 మందికి, మునిసిపాలిటీలు, కార్పొరేషన పరిధిల్లో 38,179 గృహాల్లో సర్వే నిర్వహించి 906 మందికి,  జిల్లాలోని జీహెచ్‌ఎంసీ పరిధిలో 42,041 గృహాల్లో సర్వేలు నిర్వహించి 932 మందికి మెడికల్‌ కిట్లను  పంపిణీ చేశారు.  మేడ్చల్‌ జిల్లాలోని ఆస్పత్రుల్లో మరో 1,133 మందికి మెడికల్‌ కిట్లను అందజేసినట్లు జిల్లా వైద్యాధికారి మల్లికార్జున్‌రావు తెలిపారు.

2,911 మందికి వ్యాక్సినేషన్‌ 

వ్యాక్సినేషన్‌లో భాగంగా సోమవారం వికారాబాద్‌ జిల్లాలో 4062 మందికి వ్యాక్సినేషన్‌ చేశారు.  15-18 ఏళ్లలోపు టీనేజర్లలో 270 మందికి మొదటి డోస్‌ టీకా ఇవ్వగా, 18 ఏళ్లు పైబడిన వారిలో మొదటి డోస్‌ 749 మందికి, రెండవ డోస్‌ 2990 మందికి వేశారు. కాగా, 60 ఏళ్లు పైబడిన వారికి వేసే ప్రికాషనరీ డోస్‌53 మందికి ఇచ్చారు. 

కరోనా కట్టడికే ఫీవర్‌ సర్వే

పరిగి/ఘట్‌కేసర్‌రూరల్‌,జనవరి24: కరోనా  వైరస్‌ కట్టడికి చేపట్టిన జ్వర సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని, ప్రతి ఇంటికీ వెళ్లి జ్వరంతో బాధపడుతున్న వారి వివరాలు సేకరించాలని కలెక్టర్‌ నిఖిల వైద్య సిబ్బందికి సూచించారు. సోమవారం పరిగి మునిసిపల్‌, మండల పరిధిలోని చిట్యాల్‌ గ్రామంలో ఇంటింటి సర్వేను కలెక్టర్‌ పరిశీలించి ప్రజలతో మాట్లాడారు. కొవిడ్‌ మొదటి, రెండో డోస్‌ వ్యాక్సిన్‌  తీసుకున్నారా? అని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, ప్రజలందరూ కచ్చితంగా మాస్కును ధరించి, భౌతిక దూరాన్ని పాటించాలని సూచించారు. జ్వరంలో బాధపడుతున్నవారికి కొవిడ్‌ పరీక్షలు నిర్వహించి  హోం ఐసోలేషన్‌ కిట్లను అందజేయాలని సర్వే బృందాలను ఆదేశించారు. కొవిడ్‌ రెండో  టీకా తీసుకోని వారికి వ్యాక్సిన్‌ వేయించాలని, రెండో డోసు తీసుకున్నవారికి బూస్టర్‌ డోస్‌ ఇప్పించాలని సూచించారు. కార్యక్రమంలో  డీఎంహెచ్‌వో తుకారాం, మునిపిపల్‌ చైర్మన్‌ అశోక్‌, తహసీల్దార్‌ విద్యాసాగర్‌రెడ్డి, నవ్య పాల్గొన్నారు.

పకడ్బందీగా నిర్వహించాలి : డీపీవో

ఫీవర్‌ సర్వేను పకడ్భందీగా నిర్వహించాలని మేడ్చల్‌ జిల్లా పంచాయతీ అధికారి రమణమూర్తి తెలిపారు.కొర్రెములలో సోమవారం డీపీవో సర్పంచ్‌ వెంకటేగౌడ్‌తో కలిసి  ఫీవర్‌ సర్వేను పరిశీలించారు. ప్రతిఒక్కరూ పరిసరాల పరిశుభ్రత, కొవిడ్‌ నిబంధనలు పాటించాలన్నారు. గ్రామస్థులు తమ ఇంటిపన్నులను చెల్లించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి కవితా యాదవ్‌, దయ్యాల ఆంజనేయులు, వైద్యసిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-25T04:06:48+05:30 IST