తెలంగాణలో కొత్తగా 1,771 కరోనా కేసులు
ABN , First Publish Date - 2021-06-13T01:01:23+05:30 IST
గడిచిన 24 గంటల్లో తెలంగాణలో కొత్తగా 1,771 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ రోజు కరోనాతో 13 మరణాలు సంభవించాయి.
హైదరాబాద్: గడిచిన 24 గంటల్లో తెలంగాణలో కొత్తగా 1,771 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ రోజు కరోనాతో 13 మరణాలు సంభవించాయి. తెలంగాణలో కరోనా నుంచి 2,384 మంది బాధితులు కోలుకున్నారు. తెలంగాణలో ఇవాళ 1,20,525 మందికి కరోనా పరీక్షలు చేశారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో 171 కరోనా కేసులు నమోదయ్యాయి.
మరోవైపు గడిచిన 24 గంటల్లో ఏపీలో కొత్తగా 6,952 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ రోజు నమోదయిన కేసులతో కలిపి ఏపీలో మొత్తం 18,03,074కు కరోనా కేసులు చేరాయి. 24 గంటల్లో కరోనాతో 58 మంది మృతి చెందారు. ఇప్పటివరకు కరోనాతో 11,882 మంది మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 91,417 యాక్టివ్ కేసులున్నాయి.