రాజ్‌భవన్‌లో కరోనా కలకలం! ఐసోలేషన్‌లో ‘మహా’ గవర్నర్

ABN , First Publish Date - 2020-07-12T16:38:46+05:30 IST

మహారాష్ట్ర గవర్నర్ అధికారిక నివాసం రాజ్‌భవన్‌లో కరోనా కలకలం చెలరేగింది.

రాజ్‌భవన్‌లో కరోనా కలకలం! ఐసోలేషన్‌లో ‘మహా’ గవర్నర్

ముంబై: మహారాష్ట్ర గవర్నర్ అధికారిక నివాసం రాజ్‌భవన్‌లో కరోనా  కలకలం చెలరేగింది. ఏకంగా 18 మంది సిబ్బంది కరోనా బారిన పడ్డట్టు వెల్లడైంది. గవర్నర్‌కు సమీపంలో ఉండే సిబ్బందిలో కొందరు కరోనా పాజిటివ్ అని తేలడంతో గవర్నర్ కార్యాలయం అప్రమత్తమైంది. మహా గవర్నర్ భగత్ సింగ్ కొష్యారీ స్వీయ ఐసోలేషన్ విధించుకున్నారు. రాజ్ భవన్‌లోని 100 మంది సిబ్బందికి కరోనా నిర్ధారణ పరీక్షలు జరపగా మొత్తం 18 మందికి పాజిటివ్ అని తేలింది. బీగ్‌బీ అమితాబ్ బచ్చన్, ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్ కరోనా కాటుకు గురయ్యారన్న వార్త వెలువడిన మరుసటి రోజే ఈ ఘటన వెలుగులోకి రావడం రాష్ట్రంలో కలకలానికి కారణమైంది.


ఇక కరోనా ధాటికి మహారాష్ట్ర అతలాకుతలమవుతున్నవిషయం తెలిసిందే. మునుపెన్నడూ చూడని రీతితో అక్కడ గత 24 గంటల వ్యవధిలో 7,862 కొత్త కేసులు వెలుగులోకి వచ్చాయి. దీంతో మొత్తం రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 2,38,461కి చేరుకుంది. కరోనా కట్టడి కోసం అధికారులు పూణెలో పది రోజుల లాక్ డౌన్ విధించారు. థానేలోనూ ప్రస్తుతం లాక్ డౌన్ అమలవుతోంది.

Updated Date - 2020-07-12T16:38:46+05:30 IST