18 ఏళ్ల తరువాత ఢిల్లీలో అత్యధిక వర్షపాతం నమోదు!

ABN , First Publish Date - 2021-07-28T14:38:43+05:30 IST

ఢిల్లీ-ఎన్సీఆర్‌లో కురిసిన భారీ వర్షాలతో కొంత ఉపశమనం...

18 ఏళ్ల తరువాత ఢిల్లీలో అత్యధిక వర్షపాతం నమోదు!

న్యూఢిల్లీ: ఢిల్లీ-ఎన్సీఆర్‌లో కురిసిన భారీ వర్షాలతో కొంత ఉపశమనం లభించినప్పటికీ, పలు ప్రాంతాలు నీట మునగడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఐటీఓ, తిలక్ బ్రిడ్జి తదితర ప్రాంతాల్లో రోడ్లపై ట్రాఫిక్ నిలిచిపోయింది. ఇదేవిధంగా ఈరోజు ఉదయం ఎన్‌హెచ్-24పై వాహనాలు బారులు తీరాయి. ఢిల్లీలో 18 ఏళ్ల తరువాత జూలై నెలలో తాజాగా ఈ స్థాయి భారీ వర్షాలు కురిశాయి. దీనికి ముందు 2003 జూలైలో భారీ వర్షాలు కురిశాయి. భారత వాతావరణశాఖ సఫ్దర్ జంగ్ స్టేషన్ తెలిపిన వివరాల ప్రకారం ఈ జూలై నెలలో 380 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది. 2003 జూలైలో 623 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది.

Updated Date - 2021-07-28T14:38:43+05:30 IST