Blue Origin: నింగిలోకి 18ఏళ్ల కుర్రాడు

ABN , First Publish Date - 2021-07-16T05:13:21+05:30 IST

అపర కుబేరుడు బ్లూ ఆరిజిన్ అధినేత జెఫ్ బెజోస్ అంతరిక్ష యాత్రకు మార్గం సుగమం అయింది. జెఫ్ బెజోస్ సహా మరో ముగ్గురి అంతరిక్ష విహారానికి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. దీంతో వచ్చే మంగళ

Blue Origin: నింగిలోకి 18ఏళ్ల కుర్రాడు

వాషింగ్టన్: అపర కుబేరుడు బ్లూ ఆరిజిన్ అధినేత జెఫ్ బెజోస్ అంతరిక్ష యాత్రకు మార్గం సుగమం అయింది. జెఫ్ బెజోస్ సహా మరో ముగ్గురి అంతరిక్ష విహారానికి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. దీంతో వచ్చే మంగళవారం పశ్చిమ టెక్సాస్ నుంచి ‘న్యూ షెపర్డ్’ రాకెట్ ద్వారా ‘సబ్ ఆర్బిటల్’ యాత్ర చేయనున్నారు. న్యూ షెపర్డ్’ రాకెట్ ద్వారా అంతరిక్ష యాత్రకు వెళ్లే వారి జాబితాలో జెఫ్ బెజోస్, ఆయన సోదరుడు, 82ఏళ్ల వాలీ ఫంక్‌తో 18ఏళ్ల కుర్రాడు ఉన్నాడు. కాగా.. ఈ 18ఏళ్ల కుర్రాడి పేరు ఆలివర్ డెమెన్. అంతరిక్ష యాత్ర కోసం ఆలివర్ డెమెన్.. బ్లూ ఆరిజిన్‌ సంస్థకు డబ్బులు చెల్లించాడు. ఈ క్రమంలో ఆలివర్ డెమెన్.. అంతరిక్ష యాత్ర చేయనున్న మొదటి కస్టమర్‌గా నిలవడంతోపాటు, అతిపిన్న వయస్కుడిగా గుర్తింపు పొందనున్నాడు. గతంలో దివంగత సోవియట్ వ్యోమగామి గెర్మాన్ టిలోవ్‌ 25ఏళ్లకే రోదసి యాత్ర చేసి, అంతరిక్షయానం చేసిన అతిపిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించారు. 


Updated Date - 2021-07-16T05:13:21+05:30 IST