జిల్లాలో 182 పాజిటివ్‌ కేసులు

ABN , First Publish Date - 2020-09-26T10:36:05+05:30 IST

సిద్దిపేట జిల్లాలో శుక్రవారం 182 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. సిద్దిపేట డివిజన్‌లో 96 కేసులు, గజ్వేల్‌ డివిజన్‌లో 61,

జిల్లాలో 182 పాజిటివ్‌ కేసులు

సిద్దిపేట, సెప్టెంబరు 25: సిద్దిపేట జిల్లాలో శుక్రవారం 182 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. సిద్దిపేట డివిజన్‌లో 96 కేసులు, గజ్వేల్‌ డివిజన్‌లో 61, హుస్నాబాద్‌ డివిజన్‌లో 25 కేసుల చొప్పున నమోదయ్యాయి. 


 సిద్దిపేట డివిజన్‌లో.. సిద్దిపేటలో 10, చేర్యాల సీహెచ్‌సీలో 9, పీహెచ్‌సీల వారీగా చిన్నకోడూరులో 1, ఇబ్రహింనగర్‌లో 1, దౌల్తాబాద్‌లో 1, ఇందుప్రియాల్‌లో నిల్‌, దుబ్బాక సీహెచ్‌సీలో 5, పీహెచ్‌సీల వారీగా రామక్కపేటలో 9, తిమ్మాపూర్‌లో 3, కొమురవెల్లిలో నిల్‌, మిరుదొడ్డిలో నిల్‌, భూంపల్లిలో 10, రాజగోపాల్‌పేటలో 4, నంగునూరులో 7, నారాయణరావుపేటలో 6, పుల్లూరులో 9, సిద్దిపేటలోని నాసర్‌పుర యూపీహెచ్‌సీలో 6, అంబేద్కర్‌నగర్‌  యూపీహెచ్‌సీలో 13 , తొగుటలో 2  కేసులు నమోదయ్యాయి.


గజ్వేల్‌ డివిజన్‌లో గజ్వేల్‌ ఆస్పత్రిలో 30, పీహెచ్‌సీల వారీగా అహ్మదీపూర్‌లో 1, సిరిగిరిపల్లిలో 7, జగదేవ్‌పూర్‌లో 2, తిగుల్‌లో నిల్‌, కొండపాకలో 2, కుకునూరుపల్లిలో 1, మర్కుక్‌లో 2,  ములుగులో 5, సింగన్నగూడెంలో 3, రాయపోల్‌లో 4, వర్గల్‌లో 4  కేసులు నమోదయ్యాయి.


హుస్నాబాద్‌ డివిజన్‌లో పీహెచ్‌సీల వారీగా అక్కన్నపేటలో 4, బెజ్జంకిలో నిల్‌, తోటపల్లిలో 2, హుస్నాబాద్‌లో 11, కోహెడలో 5, లద్నూర్‌లో నిల్‌, మద్దూరులో 3 కేసులు వెలుగుచూశాయి. 


13 మంది వైద్య సిబ్బందికి

సిద్దిపేటలో ఆర్‌టీపీసీఆర్‌ పరీక్షలు నిర్వహించే సెంటర్‌కు 16 మంది వైద్య సిబ్బందిని కేటాయించిన క్రమంగా 13 మందికి కొవిడ్‌ పాజిటివ్‌గా వెల్లడైంది. సిద్దిపేట రూరల్‌ మండలం చిన్నగుండవెల్లిలో ఒకే కుటుంబంలో 10 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు సమాచారం. 

Updated Date - 2020-09-26T10:36:05+05:30 IST