తల్లి చనిపోయిన 19 ఏళ్ల తర్వాత.. పిల్లలకు దొరికిన ఆమె జ్ఞాపకం

ABN , First Publish Date - 2020-02-23T01:49:01+05:30 IST

ముంబైకి చెందిన దినేశ్ కాడం శుక్రవారం తన 19 సంవత్సరాల క్రితం చనిపోయిన తల్లి జ్ఞాపకాల్లో ముగిని తేలాడు. అందుకు కారణం 28 ఏళ్ల క్రితం

తల్లి చనిపోయిన 19 ఏళ్ల తర్వాత.. పిల్లలకు దొరికిన ఆమె జ్ఞాపకం

ముంబై: ముంబైకి చెందిన దినేశ్ కాడం శుక్రవారం తన 19 సంవత్సరాల క్రితం చనిపోయిన తల్లి జ్ఞాపకాల్లో ముగిని తేలాడు. అందుకు కారణం 28 ఏళ్ల క్రితం ముంబైలోని ఓ లోకల్ ట్రైన్‌లో తన తల్లి వద్ద నుంచి దొంగిలిచబడ్డ బంగారు చెవిపోగును అతనికి కుర్లా పోలీస్ స్టేషన్‌లో రైల్వే పోలీసులు అప్పగించారు.


దినేశ్ తల్లి విజయశ్రీ మహారాష్ట్ర రాష్ట్ర రవాణ సంస్థలో ప్యూన్‌గా విధులు నిర్వర్తించేది. అయితే ఒక రోజు విధులు పూర్తి చేసుకొని లోకల్ ట్రైన్‌లో తిరిగి వస్తుండగా.. ఓ దొంగ ఆమె చెవిపోగును లాక్కొని పారిపోయాడు. అయితే ఈ ఘటన జరిగిన తర్వాత ఆమె చాలా బాధపడిందని దినేశ్ పేర్కొన్నాడు. ‘‘ఇంటికి చేరుకోగానే తన చెవి నుంచి రక్తం కారుతున్న పట్టించుకోకుండా జరిగిన విషయం చెబుతూ.. ఆమె ఎంతగానో ఏడ్చింది. ఆ చెవిపోగులు కొనేందుకు ఆమె పైసాపైసా కూడబెట్టింది’’ అని దినేశ్ తెలిపాడు. 


1978లో రైలు ప్రమాదంలో దినేశ్ తండ్రి చనిపోయిన తర్వాత అతన్ని అతని సోదరిని విజయశ్రీనే పెంచింది. తన జీవితకాలంలో ఎన్నో కష్టాలు ఎదురుకున్న ఆమె చివరుకు 2001 ప్రాణాలు కోల్పోయింది. ఆ తర్వాత దినేశ్ ఖార్‌ఘర్‌కి మారిపోగా.. అతను సోదరి ఆమె భర్తతో కలిసి డొంబివలిలో నివసిస్తున్నారు. నిజానికి తన తల్లి విషయంలో జరిగిన ఘటనని వీరిద్దరు మర్చిపోయారు. అయితే రెండు వారాల క్రితం దినేశ్‌కు కుర్లా రైల్వేపోలీసులు ఫోన్ చేసి తన తల్లికి సంబంధించిన నగను  తీసుకోవాలంటూ తెలిపారు. దీంతో శుక్రవారం దినేశ్, అతని సోదరి కుర్లా పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఆ చెవిపోగును తీసుకున్నారు. ‘‘మా కోసం మా ఆమ్మ పడ్డ కష్టాలకు గుర్తుగా ఈ చెవిపోగును దాచుకుంటామని’’ దినేశ్ చెప్పాడు.

Updated Date - 2020-02-23T01:49:01+05:30 IST