Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఆమెకు 19 ఏళ్లు.. 6 నెలల క్రితం పెళ్లి.. రోజూ ఆలస్యంగా ఇంటికి వస్తున్న భర్త.. ఆ రోజు రాత్రి 11 గంటలకు..

ఇంటర్నెట్ డెస్క్: ఆమెకు 19ఏళ్లు.. అబ్బాయికేమో 24ఏళ్లు. ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారు. పెళ్లి చేసుకుని ఒకటయ్యారు. కుటుంబ సభ్యులకు దూరంగా అద్దె గదిలో కొత్త కాపురాన్ని మొదలు పెట్టారు. ఆరు నెలల వరకూ వారి జీవితం సంతోషంగానే సాగింది. ఈ క్రమంలో ఎప్పటిలాగే అతడు.. ఉదయం 8 గంటలకే పని వెళ్లాడు. తిరిగి రాత్రి 11 గంటలకు తిరిగొచ్చాడు. అనంతరం ఇంట్లోని దృశ్యం చూసి షాకయ్యాడు. అంతేకాకుండా పొరిగింటి వారి కోసం కేకలు వేశాడు. అనంతరం ఏం జరిగింది అనే వివరాల్లోకి వెళితే..


బెంగాల్‌కు చెందిన మౌమిత సితారా అనే 19ఏళ్ల యువతి, స్థానికంగా ఉంటున్న 24ఏళ్ల అబ్బాయి ఒకరినొకరు ఇష్టపడ్డారు. కొద్ది రోజులుగా ప్రేమలో మునిగితేలారు. అనంతరం పెళ్లి బంధంతో ఒక్కటై.. రాజస్థాన్‌లో అద్దె గదిలో కొత్త కాపురం కూడా ప్రారంభించారు. ఈ క్రమంలోనే ఆరు నెలలు గడిచిపోయింది. ఎప్పటిలాగే తాజాగా ఉదయాన్నే 8 గంటలకు పనికి వెళ్లిపోయాడు. అనంతరం రాత్రి 11 గంటలకు ఇంటికి చేరుకున్నాడు. గది తలుపులు మూసి ఉంటడంతో వాటిని తట్టాడు. అయితే ఎన్నిసార్లు తలుపులు తట్టినా లోపల నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో.. అతడు కంగారుపడ్డాడు.


పక్కంటి వారిని పిలిచి.. వారి సహాయంతో గది తలుపులు పగలగొట్టారు. అనంతంర గదిలో దృశ్యాలను చూసి అతడు షాకయ్యాడు. సితారా ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడటాన్ని చూసి విస్తుపోయాడు. వెంటనే ఆమెను కిందకు దించి, ఆసుపత్రికి తీసుకెళ్లాడు. అయితే అక్కడను సితారాను పరీక్షించిన వైద్యులు ఆమె అప్పటికే చనిపోయిటన్లు తేల్చేశారు. ఈ విషయం పోలీసుల దృష్టికి వెల్లడంతో కేసు నమోదు చేసుకుని, ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు ఏంటి అనే అంశాలపై ఆరా తీస్తున్నారు. ఇవి కూడా చదవండిImage Caption

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement