Abn logo
Sep 16 2021 @ 16:43PM

Kuwait లో 192 మంది ప్రవాసుల అరెస్ట్.. అసలేం జరిగిందంటే..

కువైత్ సిటీ: గల్ఫ్ దేశం కువైత్‌లో ఏకంగా 192 మంది ప్రవాసులు అరెస్ట్ అయ్యారు. రెసిడెన్సీ ఉల్లంఘనదారులు, యజమానుల నుంచి తప్పించుకున్న వారే లక్ష్యంగా ప్రజా భద్రతా వ్యవహారాల అసిస్టెంట్ అండర్ సెక్రటరీ మేజర్ జనరల్ ఫర్రాజ్ అల్ జౌబీ పర్యవేక్షణలో అంతర్గత మంత్రిత్వశాఖ సిబ్బంది తాజాగా తనిఖీలు చేపట్టింది. దీంతో 192 మంది వలసదారులు సిబ్బందికి చిక్కారు. అహ్మదీ డైరెక్టరేట్, ముబారక్ అల్ కబీర్ ప్రాంతాల్లో నిర్వహించిన సోదాల్లో ఇలా భారీ మొత్తంలో ప్రవాసులు రెసిడెన్సీ ఉల్లంఘనలకు పాల్పడినట్లు అధికారులు తెలిపారు. 


ఇవి కూడా చదవండి..

America లో దారుణం.. శవాలుగా కనిపించిన భారతీయ విద్యార్థులు.. కారులో వెళ్తుండగా..

ఇకపై NRI లకు పిల్లలను దత్తత తీసుకోవడం చాలా సులువు..అహ్మదీ డైరెక్టరేట్‌లో 74 మందిని, ముబారక్ అల్ కబీర్‌లో 118 మందిని అరెస్టు చేసిన్నట్లు అధికారులు వెల్లడించారు. చాలా మంది గృహాకార్మికులు వారి స్పాన్సర్స్ నుంచి తప్పించుకుని బయటి వారి దగ్గర పనిచేస్తున్నట్లు సిబ్బంది గుర్తించింది. ఈ సందర్భంగా ఫర్రాజ్ అల్ జౌబీ మాట్లాడుతూ.. అరెస్టు చేయబడిన నివాస ఉల్లంఘనదారులను జైలుకు తరలిస్తామని తెలిపారు. అక్కడ వారి స్పాన్సర్‌లను పిలిచి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుతుందన్నారు. అనంతరం వారి నుంచి ప్రవాసులకు ప్రయాణ ఖర్చులను వసూలు చేయనున్నట్లు చెప్పారు. ఆ తర్వాత ప్రవాసులను వారి దేశాలకు పంపించడం జరుగుతుందని చెప్పుకొచ్చారు.


ఇవి కూడా చదవండిImage Caption

తాజా వార్తలుమరిన్ని...