పని తప్పించుకోవాలని ఇలా చేస్తే.. అలా ఉద్యోగం పోయింది..!

ABN , First Publish Date - 2021-02-24T01:13:15+05:30 IST

సెలవు కావాలనుకునే ఉద్యోగి ఏం చేస్తాడు. ముందు ఆపై అధికారులను సంప్రదిస్తాడు. వారి అనుమతి లభించగానే..సెలవు పెట్టేస్తాడు. కానీ..పని నుంచి తప్పించుకోవాలని ఓ చేసిన ప్రయత్నం చివరికి అతడు ఉద్యోగం కోల్పోయేలా చేసింది.

పని తప్పించుకోవాలని ఇలా చేస్తే.. అలా ఉద్యోగం పోయింది..!

ఇంటర్నెట్ డెస్క్: సెలవు కావాలనుకునే ఉద్యోగి ఏం చేస్తాడు. ముందు ఆపై అధికారులను సంప్రదిస్తాడు. వారి అనుమతి లభించగానే..సెలవు పెట్టేస్తాడు. కానీ..పని నుంచి తప్పించుకోవాలని ఓ చేసిన ప్రయత్నం చివరికి అతడు ఉద్యోగం కోల్పోయేలా చేసింది. అమెరికాలోని అరిజోనా రాష్ట్రానికి చెందిన బ్రండన్ సోల్స్(19) అనే యువకుడు కూలిడ్జ్ ప్రాంతంలోని ఓ టైర్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు. అయితే..పనికి ఎగనామం పెట్టేందుకు అతడు ఇటీవల భారీ ప్లాన్ వేశాడు. తొలుత ఆఫీసు నుంచి బయటపడ్డ అతడు తనను ఎవరో కిడ్నాప్ చేశారంటూ ఓ పెద్ద సీన్ సృష్టించాడు. చేతులకు తాళ్లతో..కదలలేక దుమ్ములో పడి ఉన్న అతడిని పోలీసులు రక్షించారు. విచారణ సందర్భంగా పోలీసులకు మనోడు పెద్ద స్టోరీ వినిపించాడు. తన తండ్రి ధనవంతుడని..డబ్బుల కోసమే తనను కిడ్నాప్ చేసేందుకు యత్నించాడని పోలీసులకు చెప్పుకొచ్చాడు. అయితే..ఈ నేరానికి సంబంధించిన ఆధారాలేవీ పోలీసులకు లభ్యం కాలేదు. ఇక్కడ ఏదో మతలబు ఉందని అనుమానించిన పోలీసులు మరింత లోతుగా విచారణ చేపడటంతో మనోడి డ్రామా మొత్తం బయటపడిపోయింది. మరుసటి రోజు పనికి రాకుండా ఉండేందుకే ఇంత నాటకమాడానని చివరి అంగీకరించారు. దీంతో.. పోలీసులు అతడిపై కేసు నమోదు ఫిబ్రవరి 11న అరెస్టు చేశారు. ఫ్యాక్టరీ యాజమాన్యం ఏమో అతడిని విధుల నుంచి తొలగించింది. పని నుంచి తప్పించుకునేందుకు చేసిన ప్రయత్నం చివరికి అతడికి కటకటాల పాలు చేసింది.

Updated Date - 2021-02-24T01:13:15+05:30 IST