పదేళ్లలో 2.5 కోట్ల కొత్త ఉద్యోగాలు

ABN , First Publish Date - 2021-03-09T07:08:02+05:30 IST

గడిచిన దశాబ్దకాలంలో భారత రిటైల్‌ రంగం 3 రెట్లకు పైగా వృద్ధి నమోదు చేసుకుందని నాస్కామ్‌ అధ్యయన నివేదిక పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరం(2019-20) జీడీపీలో రిటైల్‌ రంగ వాటా 10 శాతంగా నమోదైందని, 3.5 కోట్లకు పైగా మొత్తం

పదేళ్లలో 2.5 కోట్ల కొత్త ఉద్యోగాలు

2030 నాటికి రూ.110 లక్షల కోట్లు

భారత రిటైల్‌ రంగంపై నాస్కామ్‌ నివేదిక 


న్యూఢిల్లీ: గడిచిన దశాబ్దకాలంలో భారత రిటైల్‌ రంగం 3 రెట్లకు పైగా వృద్ధి నమోదు చేసుకుందని నాస్కామ్‌ అధ్యయన నివేదిక పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరం(2019-20) జీడీపీలో రిటైల్‌ రంగ వాటా 10 శాతంగా నమోదైందని, 3.5 కోట్లకు పైగా మొత్తం ఉద్యోగుల్లో 8 శాతం వాటా ఈ రంగానిదేనని ఆ నివేదిక తెలిపింది. దేశీయ రిటైల్‌ రంగంలో నాలుగో తరం పరివర్తన పరిణామాలు, అవకాశాలకు సంబంధించిన ఈ నివేదికలోని మరిన్ని ముఖ్యాంశాలు.. 


  • వ్యాపారాల స్థితిస్థాపకత, అనుసరణీయతకు కరోనా సంక్షోభం లిట్మస్‌ పరీక్షలాంటిది. డిజిటల్‌ సాంకేతికత వినియోగంతోపాటు ఆన్‌లైన్‌ సేవల విధానానికి మారడం ద్వారా దేశీయ రిటైల్‌ రంగం ఈ సంక్షోభాన్ని అధిగమించగలిగింది. 
  • ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ రిటైల్‌ వ్యాపార విధానాల కలయిక,  సాంకేతికత వినియోగం ద్వారా వాటి సమిష్టి సామర్థ్యాల వికాసం.. దేశీయ రిటైల్‌ రంగంలో నాలుగో తరం పరివర్తనాన్ని నిర్వచించనున్నాయి. ఈ తరం పరివర్తనంలో దేశీయ రిటైల్‌ రంగ పరిమాణం, ఉద్యోగాల కల్పన, ఎగుమతులు గణనీయంగా పెరగనున్నాయి. 
  • 2030 ఆర్థిక సంవత్సరం నాటికి భారత రిటైల్‌ మార్కెట్‌ పరిమాణం 1.5 లక్షల కోట్ల డాలర్ల (దాదాపు రూ.110 లక్షల కోట్లు)కు చేరుకోవచ్చు. అలాగే, ఈ రంగం 2.5 కోట్ల కొత్త ఉద్యోగాలను సృష్టించనుందని అంచనా. అందులో 50 శాతం(1.2 కోట్ల) ఉద్యోగాల కల్పన ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ సమ్మిళిత విధానంలోనే జరగవచ్చు. అంతేకాదు, 12,500 కోట్ల డాలర్ల (రూ.9.13 లక్షల కోట్లు) ఎగుమతులకు, రిటైల్‌ రంగ మొత్తం పన్నుల్లో 37 శాతం చెల్లింపులకు ఈ విధానం దోహదపడనుంది. 

Updated Date - 2021-03-09T07:08:02+05:30 IST