Abn logo
Aug 14 2020 @ 10:47AM

కశ్మీర్ లో ఉగ్రదాడి.. అమరులైన ఇద్దరు పోలీసులు

శ్రీనగర్ : శ్రీనగర్ లోని నౌగామ్ జిల్లాలో పోలీసుల బృందంపై ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ దాడిలో ఇద్దరు పోలీసులు అమరులయ్యారు. ఉగ్ర దాడి జరిగిన తర్వాత ఈ ఇద్దర్ని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న సమయంలో వీరు అమరులయ్యారని ఉన్నతాధికారులు ప్రకటించారు. ‘‘నౌగాన్ బైపాస్ రోడ్డులో పోలీసులపై విచక్షణరహితంగా ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ముగ్గురు పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆస్పత్రికి తరలించాం. చికిత్స పొందుతున్న సమయంలో ఇద్దరు పోలీసులు అమరులయ్యారు.’’ అని ఉన్నతాధికారులు ప్రకటించారు. 

Advertisement
Advertisement
Advertisement