2 రోజులు తేలికపాటి వర్షాలు

ABN , First Publish Date - 2020-10-22T07:07:38+05:30 IST

రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు రెండు రోజులు (గురు, శుక్రవారాల్లో)

2 రోజులు తేలికపాటి వర్షాలు

హైదరాబాద్‌, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు రెండు రోజులు (గురు, శుక్రవారాల్లో) కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతున్నదని తెలిపింది.

ఇది రాగల 12 గంటల్లో వాయువ్య దిశగా ప్రయాణించి ఆతర్వాత 48 గంటల్లో ఒడిసా తీరానికి దగ్గరలో ఉన్న వాయువ్య బంగాళాఖాతం మీదుగా పశ్చిమబెంగాల్‌, బంగ్లాదేశ్‌ తీరాలపై ప్రయాణించే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది. 


Updated Date - 2020-10-22T07:07:38+05:30 IST