పిల్ల‌ల కోసం సిద్ద‌మైన రెండు క‌రోనా వ్యాక్సిన్లు... యాంటీ బాడీల వృద్ధికి దోహ‌దం!

ABN , First Publish Date - 2021-06-17T15:59:25+05:30 IST

కరోనా సెకండ్ వేవ్ స‌ద్దుమ‌ణ‌గ‌క...

పిల్ల‌ల కోసం సిద్ద‌మైన రెండు క‌రోనా వ్యాక్సిన్లు... యాంటీ బాడీల వృద్ధికి దోహ‌దం!

న్యూఢిల్లీ: కరోనా సెకండ్ వేవ్ స‌ద్దుమ‌ణ‌గ‌క ముందే థ‌ర్డ్ వేవ్‌కు సంబంధించిన హెచ్చ‌రిక‌లు అందుతున్నాయి. నిపుణుల అంచ‌నాల ప్రకారం కరోనా థ‌ర్డ్ వేవ్‌ పిల్లలకు ప్రమాదకరంగా మార‌నుంది. ఈ హెచ్చ‌రిక‌ల నేపధ్యంలో మోడెర్నాతో పాటు మరొక ప్రోటీన్ ఆధారిత వ్యాక్సిన్ ప్రారంభ ఫలితాలు సానుకూలంగా వ‌చ్చాయి. కోతి పిల్లలపై నిర్వహించిన పరీక్షలో వ్యాక్సిన్ పూర్తిగా సురక్షితమైన‌ద‌ని వెల్ల‌డ‌య్యింది. 


కోతి పిల్ల‌ల‌పై జ‌రిగిన ప్ర‌యోగంలో సార్స్-కోవ్‌-2 వైరస్‌తో పోరాడటంలో వ్యాక్సిన్ సమర్థవంతమైన ప్రతిరోధకాలను సృష్టించగలిగింద‌ని తేలింది. ఈ పరిశోధనల‌ ప్రకారం వ్యాక్సిన్ వేసిన త‌రువాత‌ 22 వారాలపాటు వైర‌స్‌తో పోరాడే సామర్థ్యం వాటికి వ‌చ్చింద‌ని తేలింది. అమెరికాలోని న్యూయార్క్‌- ప్రెస్బిటేరియన్ కామన్ స్కై చిల్డ్రన్స్ హాస్పిటల్‌కు చెందిన సాలీ పెర్మర్ తెలిపిన వివ‌రాల ప్ర‌కారం కోతి పిల్లలపై పరీక్షల అనంత‌రం వెలువడిన ఫలితాలు ఉపశమనం కలిగిస్తున్నాయ‌ని, ఈ వ్యాక్సిన్ చిన్న పిల్లల‌కు పూర్తిగా సురక్షితమైనద‌ని, కరోనాను చాలా వరకు నిరోధించడానికి సహాయపడుతుంద‌ని తెలిపారు. ఇదిలావుండ‌గా రష్యాలో ఇప్పటికే 8 నుంచి 12 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న పిల్లలపై స్పుత్నిక్-వికి చెందిన నాజ‌ల్ స్ప్రేయ‌ర్ ప్ర‌యోగాలు జరుగుతున్నాయి.

Updated Date - 2021-06-17T15:59:25+05:30 IST