వ్యాక్సిన్ కోసం వృద్దుల్లా నటించిన మహిళలు.. అమెరికాలో..

ABN , First Publish Date - 2021-02-21T10:03:48+05:30 IST

కరోనా బారిన ఎక్కువగా వయసు పైబడిన వారు పడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ముందుగా

వ్యాక్సిన్ కోసం వృద్దుల్లా నటించిన మహిళలు.. అమెరికాలో..

ఆర్లాండో, ఫ్లోరిడా: కరోనా బారిన ఎక్కువగా వయసు పైబడిన వారు పడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ముందుగా వ్యాక్సిన్ డోస్‌ను వయసు పైబడిన వారికే ఇస్తున్నారు. అమెరికా ప్రభుత్వం సైతం ఇదే చేస్తోంది. ఇదే సమయంలో ఇద్దరు మహిళలు తాము కూడా వ్యాక్సిన్ డోస్ వేయించుకునేందుకు వృద్దుల్లా నటించి దొరికిపోయారు. అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో గత బుధవారం ఈ సంఘటన చోటుచేసుకుంది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. 34, 44 వయసున్న ఇద్దరు మహిళలు వ్యాక్సిన్ కోసం వృద్దుల్లా వేషం వేసుకుని వ్యాక్సినేషన్ సెంటర్‌కు వచ్చారు. 


వారి దగ్గర సరైన సీడీసీ కార్డ్, వ్యాక్సినేషన్ కార్డ్ కూడా ఉన్నట్టు వైద్యులు చెబుతున్నారు. అయితే వారి డ్రైవింగ్ లైసెన్స్‌తో ఆ ఐడీలు మ్యాచ్ కాలేదని, పైగా వారు ఫన్నీగా ఉండటం తాము గమనించామన్నారు. దీంతో వెంటనే పోలీసులను పిలవగా అసలు నిజం బయటపడిందన్నారు. ఇప్పటికే వారు ఒక వ్యాక్సిన్ డోస్ వేసుకున్నారని, ఇప్పుడు రెండో డోస్ వేయించుకోవడానికి వ్యాక్సినేషన్ సెంటర్‌కు వచ్చినట్టు వైద్యులు తెలిపారు. వారిద్దరూ మొదటి డోస్‌ను ఎలా తీసుకున్నారో తమకు కూడా అర్థం కావడం లేదని వైద్యులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కాగా.. మహిళలిద్దరిని అధికారులు కేవలం హెచ్చరించి వదిలేసినట్టు తెలుస్తోంది. 

Updated Date - 2021-02-21T10:03:48+05:30 IST