వ్యాక్సిన్ కోసం వేషం వేసి.. అడ్డంగా బుక్కయ్యారు!

ABN , First Publish Date - 2021-02-20T23:39:12+05:30 IST

కరోనా వ్యాక్సిన్ పొందడం కోసం ఇద్దరు మహిళలు పక్కాగా ప్లాన్ చేసుకుని.. చివరికి అధికారులకు దొరికిపోయిన ఘటన ఫ్లోరిడాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. అమెరికాలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోం

వ్యాక్సిన్ కోసం వేషం వేసి.. అడ్డంగా బుక్కయ్యారు!

ఫ్లోరిడా: కరోనా వ్యాక్సిన్ పొందడం కోసం ఇద్దరు మహిళలు పక్కాగా ప్లాన్ చేసుకుని.. చివరికి అధికారులకు దొరికిపోయిన ఘటన ఫ్లోరిడాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. అమెరికాలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. మొదటగా ఫ్రంట్ లైన్ వర్కర్లకు, వృద్ధులకు అక్కడి ప్రభుత్వం వ్యాక్సిన్‌ను అందిస్తోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో వరుసగా 34, 44ఏళ్ల వయసు ఉన్న ఇద్దరు మహిళలు.. కొవిడ్ వ్యాక్సిన్‌ను తీసుకునేందకు పక్కాగా ప్లాన్ చేశారు. చేతులకు గ్లౌవ్స్ వేసుకుని, కళ్లద్దాలు పెట్టుకుని.. వృద్ధులుగా తయారై ఆరెంజ్ కౌంటీలోని వ్యాక్సినేషన్ కేంద్రానికి కొద్ది రోజుల క్రితం వెళ్లారు. అప్పుడు వారి ప్లాన్ విజయవంతమైంది. టీకా మొదటి డోసును పొందారు. కాగా.. రెండో డోసు కోసం సదరు మహిళలు అదే వేషంలో తాజాగా వ్యాక్సినేషన్ కేంద్రానికి వెళ్లారు. అయితే ఈసారి వారి గుట్టు రట్టయింది. ఆ మహిళలు వృద్ధులు కాదనే విషయాన్ని అధికారులు కనిపెట్టేశారు. ఈ క్రమంలో అధికారులు సదరు మహిళలకు రెండో డోసు ఇవ్వలేదు సరికదా.. ‘ఇలాంటి పిచ్చిపిచ్చి వేషాలు వేస్తే.. అరెస్ట్ చేయించి జైలుకు పంపుతాం’ అని హెచ్చరించారు.


Read more