యుద్ధ నౌకల్లో ‘మహిళా’యుగం ప్రారంభమైంది...

ABN , First Publish Date - 2020-09-21T21:39:13+05:30 IST

భారత నౌకాదళంలో ‘మహిళ’ యుగం ప్రారంభమైంది. తొలి మహిళా అధికారులుగా సబ్ లెఫ్టినెంట్

యుద్ధ నౌకల్లో ‘మహిళా’యుగం ప్రారంభమైంది...

న్యూఢిల్లీ : భారత నౌకాదళంలో ‘మహిళ’ యుగం ప్రారంభమైంది. తొలి మహిళా అధికారులుగా సబ్ లెఫ్టినెంట్ కుముదిని త్యాగి, రితిసింగ్ అడుగుపెట్టనున్నారు. నౌకా దళంలోని పలు ర్యాంకుల్లో ఎంతో మంది మహిళా అధికారులున్నా, యుద్ధ నౌకల్లో మాత్రం మహిళల నియామకం ఇదే తొలిసారి.


ఎక్కువ సమయం విధులు నిర్వర్తించాల్సి రావడం, వీరికిచ్చే నివాస గృహల్లో పలు ఇబ్బందులు, శౌచాలయాల కొరత..... ఇలాంటి పలు కారణాలతో ఇప్పటి వరకూ యుద్ధ నౌకల్లో మహిళా అధికారులను ప్రభుత్వం వినియోగించుకోలేదు. ఇప్పుడు మాత్రం ఈ ఇద్దరికి ప్రభుత్వం అవకాశం కల్పించింది. నేవీ బహుళ ప్రయోజన హెలికాప్టర్లు, ఇంటెలిజెన్స్, నిఘా పరిశీలన, సెన్సార్ ఆపరేటింగ్‌తో పాటు వివిధ అంశాల్లో వీరు శిక్షణ తీసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. వీరిద్దర్నీ అత్యాధునికమైన ఎంహెచ్-60 ఆర్ హెలికాప్టర్లలో వీరు విధులు నిర్వర్తించనున్నారు. 

Updated Date - 2020-09-21T21:39:13+05:30 IST