ఫోన్లో బొమ్మల వీడియోలు పెట్టి రెండేళ్ల కొడుక్కి ఇచ్చి స్నానానికి వెళ్లిందా తల్లి.. తిరిగొచ్చేసరికి జరిగిన దారుణమిది..!

ABN , First Publish Date - 2021-09-14T20:35:26+05:30 IST

పెద్దవాళ్లే కాదు.. ఊహ తెలియని చిన్న పిల్లలు కూడా మొబైల్ ఫోన్ మాయలో పడి ప్రపంచాన్నే మర్చిపోతున్నారు.

ఫోన్లో బొమ్మల వీడియోలు పెట్టి రెండేళ్ల కొడుక్కి ఇచ్చి స్నానానికి వెళ్లిందా తల్లి.. తిరిగొచ్చేసరికి జరిగిన దారుణమిది..!

పెద్దవాళ్లే కాదు.. ఊహ తెలియని చిన్న పిల్లలు కూడా మొబైల్ ఫోన్ మాయలో పడి ప్రపంచాన్నే మర్చిపోతున్నారు. అల్లరి చేయకుండా ఉంటారనే నెపంతో చిన్న పిల్లలకు కూడా వారి తల్లిదండ్రులు మొబైల్స్ ఇచ్చేస్తున్నారు. అలా ఇవ్వడం ఎన్నో అనర్థాలకు దారి తీస్తోంది. తాజాగా ఓ రెండేళ్ల బాలుడు మొబైల్ కారణంగానే ప్రమాదంలో చిక్కుకున్నాడు. రెండ్రోజుల పాటు ఆస్పత్రిలో పోరాడి ప్రాణాలు కోల్పోయాడు. గుజరాత్‌లోని సూరత్‌లో ఈ ఘటన జరిగింది. 


ఇవి కూడా చదవండి

17 ఏళ్ల కుర్రాడు మిస్సింగ్.. పక్కింట్లో ఉండే 30 ఏళ్ల వివాహిత కూడా అదృశ్యం.. అసలు కథేంటో తెలిసి అంతా షా





మ్యాట్రిమోనీ సైట్ ద్వారా పరిచయం.. పెళ్లి చేసుకున్న మర్నాడే అతడి నుంచి ఊహించని ప్రపోజల్.. ఆమె నో చెప్పిందని..


సూరత్‌కు చెందిన వసీం అన్సారీ అనే వ్యక్తి తన భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి ఓ అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్నాడు. శనివారం ఉదయం ఐదేళ్ల పెద్ద కొడుకును తీసుకుని వసీం బయటకు వెళ్లాడు. చిన్నకొడుకు, రెండేళ్ల వరీష్ మొబైల్‌లో బొమ్మల వీడియోలు చూస్తూ ఇంట్లోనే ఉండిపోయాడు. వరీష్ ఫోన్ చూస్తున్నాడు కదాని అతడి తల్లి స్నానం చేసేందుకు బాత్రూంకు వెళ్లింది. కొద్దిసేపటి తర్వాత వరీష్ ఫోన్ చూస్తూ బయటకు నడిచాడు. చూసుకోకుండా ముందుకు నడవడంతో బాల్కనీ నుంచి జారిపడ్డాడు. 


నాలుగో అంతస్థులోని ఫ్లాట్ బాల్కనీ నుంచి కింద పడడంతో వరీష్‌కు తీవ్రంగా గాయాలయ్యాయి. కిందన ఉన్న వ్యక్తులు వెంటనే అంబులెన్స్‌కు ఫోన్ చేసి వరీష్‌ను ఆస్పత్రికి చేర్చారు. హాస్పిటల్‌లో హరీష్ 55 గంటల పాటు చికిత్స తీసుకున్నాడు. అయితే తలకు బలమైన గాయాలు తగలడంతో వరీష్‌ను వైద్యలు కాపాడలేకపోయారు. సోమవారం మధ్యాహ్నం వరీష్ తుదిశ్వాస విడిచాడు. 

Updated Date - 2021-09-14T20:35:26+05:30 IST