వయస్సు చిన్న... ప్రతిభ మిన్న

ABN , First Publish Date - 2021-09-15T05:30:00+05:30 IST

రెండేళ్ల వయస్సంటే ఇంకా మాటలు కూడా సరిగ్గారావు. కానీ హైదరాబాద్‌కు చెందిన ఆహిరా బన్సాల్‌ అనే చిన్నారి మాత్రం తన ప్రతిభతో అబ్బురపరుస్తోంది...

వయస్సు చిన్న... ప్రతిభ మిన్న

రెండేళ్ల వయస్సంటే ఇంకా మాటలు కూడా సరిగ్గారావు. కానీ హైదరాబాద్‌కు చెందిన ఆహిరా బన్సాల్‌ అనే చిన్నారి మాత్రం తన ప్రతిభతో అబ్బురపరుస్తోంది. ఈ చిన్నారి పదిహేడు దేశాల జాతీయ పతాకాలను గుర్తించి ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డుల్లో స్థానం సంపాందించింది. రెండేళ్లు కూడా నిండని ఆహిరా ఏది చెప్పినా ఇట్టే నేర్చేసుకుంటుంది. 

16 రకాల జంతువులు, 14 రకాల పక్షులు, 10 రకాల పండ్లను గుర్తిస్తుంది. అంతేకాదు ఏడు రకాల వాహనాలను సైతం ఇట్టే చెప్పేస్తుంది. ఈ చిన్నారి ప్రతిభను చూసిన వారు అభినందించకుండా ఉండలేకపోతున్నారు.

Updated Date - 2021-09-15T05:30:00+05:30 IST