Advertisement
Advertisement
Abn logo
Advertisement

రెండేళ్ల క్రితం బంధువుల అమ్మాయితో అబ్బాయి జంప్.. దీపావళి రోజు రాత్రి అనూహ్య ఘటన.. దీంతో ఉలిక్కిపడ్డ గ్రామస్థులు

ఇంటర్నెట్ డెస్క్: అతడు టీనేజీ అబ్బాయి. 18ఏళ్లు కూడా నిండని ఆ అబ్బాయి.. ఊరిలోనే ఉన్న బంధువుల అమ్మాయిని చూసి ఇష్టపడ్డాడు. ఆ తర్వాత ప్రేమిస్తున్నానంటూ వెంట పడ్డాడు. ఈ క్రమంలోనే ఆ మైనర్ బాలిక కూడా తెలిసీ తెలియని తనంతో అతడి ప్రేమకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో తమ విషయం ఊరిలో బయటపడకుండా.. కలిసి తిరిగారు. అనంతరం పెళ్లి చేసుకుని ఒకటవుదామని నిశ్చయించుకున్నారు. ఈ క్రమంలోనే రెండేళ్ల క్రితం ఆ మైనర్ పిల్లలు లేచిపోయారు. ఈ విషయం అప్పట్లో ఊళ్లో వారిని ఆశ్చర్యపరిచింది. అయితే తాజాగా దీపావళి రోజు ఆ ఊరిలో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. దీంతో గ్రామస్థులు విస్తుపోయారు. కాగా.. ఇంతకూ విషయం ఏంటి అనే వివరాల్లోకి వెళితే.. 


మధ్యప్రదేశ్‌లోని చాంద్‌పూర్ పోలీస్‌ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన ఓ మైనర్ బాలుడు.. తమ బంధువుల అమ్మాయిని ప్రేమించాడు. ఆ మైనర్ బాలిక కూడా ఆ అబ్బాయి ఇష్టపడింది. ఈ క్రమంలోనే ఎక్కడికైనా పారిపోయి పెళ్లి చేసుకోవాలని వారిద్దరూ భావించారు. దీంతో ఆ మైనర్ బాలిక.. తన తల్లికి సబంధించిన వెండి ఆభరణాలను తీసుకుని.. ఆ అబ్బాయితో పరారైంది. ఈ ఘటన రెండేళ్ల క్రితం జరగ్గా.. వారు లేచిపోయారనే వార్త అప్పట్లో ఆ గ్రామంలో చర్చనీయాంశం అయింది. 


అయితే తాజాగా దీపావళి రోజు రాత్రి ఆ అమ్మాయి పట్టుకెళ్లిన ఆభరణల విషయంపై ఇరు కుటుంబాల మధ్య వాగ్వాదం జరిగింది. గొడవ తీవ్ర రూపం దాల్చి ఒకరు నొకరు కొట్టుకునే వరకూ వెళ్లింది. ఈ క్రమంలో పదునైన ఆయుదాలతో దాడి చేసుకోవడం వల్ల.. ఇరు కుటుంబాలకు చెందిన నలుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఆ గ్రామస్థులు ఒక్కసారిగా షాకయ్యారు. అంతేకాకుండా పోలీసులకు సమాచారం అందించారు. ఈ నేపథ్యంలో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అంతేకాకుండా ఇరు కుటుంబాలకు చెందిన ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఇరు కుటుంబాలకు చెందిన వాళ్లు.. ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. ఇవి కూడా చదవండిImage Caption

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement