ఒక్క రోజే 20 కేసులు

ABN , First Publish Date - 2020-07-07T10:35:00+05:30 IST

జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసులతో అట్టుడికిపోతోంది. సోమవారం ఒక్క రోజే 20 కేసులు నమోదయ్యాయి

ఒక్క రోజే 20 కేసులు

కరోనాతో అట్డుడుకుతున్న జిల్లా

ఆందోళనలో ప్రజలు

నిబంధనలు బేఖాతరు


మంచిర్యాల, జూలై 6 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసులతో అట్టుడికిపోతోంది. సోమవారం ఒక్క రోజే 20 కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో జిల్లా లో మొత్తం 151 కేసులు నమోదు కావడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మంచిర్యాల పట్టణంలో 10, హాజీపూర్‌లో 2, మందమర్రిలో 2, నస్పూర్‌లో 5, బెల్లంపల్లిలో 1 కేసు నమోదైంది. 


మంచిర్యాలలో పది కేసులు స్టేషన్‌ రోడ్డు, మార్కెట్‌ ప్రాంతంలో నమోదయ్యాయి. ఇందులో ఒక టీచర్‌ ఉన్నారు. ఒకే కుటుంబంలో గతంలో ఒకరికి పాజిటివ్‌ రాగా మరో ముగ్గురికి సోకింది. మందమర్రిలో గద్దెరాగడిలో ఒకరికి, స్థానిక మార్కెట్‌ ప్రాంతంలో ఒకరు ఉన్నారు. హాజీపూర్‌ మండలంలో గతంలో వచ్చిన ముగ్గురి నుంచి మరో ఇద్దరు కుటుంబ సభ్యులకు పాజిటివ్‌ వచ్చింది. బెల్లంపల్లిలోని స్టేషన్‌ రోడ్డులో గతంలో వచ్చిన పాజిటివ్‌ నుంచి ఒకరికి విస్తరించింది.


నిబంధనలు బేఖాతర్‌

మంచిర్యాల, బెల్లంపల్లి, మందమర్రి, నస్పూర్‌, హాజీ పూర్‌ ప్రాంతాలలో ఎక్కువ పాజటివ్‌ కేసులు నమోద వుతున్నాయి. ఈ ప్రాంతాలలో మాస్క్‌లు ధరించకుండా, భౌతికదూరం పాటించకుండా జనం తిరుగుతున్నారు. ఒకవైపు అధికారులు, వైద్య నిపుణులు, పోలీసులు చెబు తున్నప్పటికీ ఎవరూ పట్టించుకోవడం లేదు. రద్దీ ప్రాం తాలు, ప్రయాణం చేసే వారు సైతం ఉపయోగించడం లేదు. ఆషాఢం బోనాలు, దావత్‌లు కొనసాగుతున్నాయి.  నిబంధనలు పాటించకపోవడం వల్లనే కరోనా విస్తరి స్తోందని వైద్యులు పేర్కొంటున్నారు. ఈ  పరిస్థితి ఇలా గే కొనసాగితే రానున్న రోజుల్లో మరిన్ని కేసులు నమోదయ్యే పరిస్థితి ఉందని, ప్రైమరీ కాంటాక్ట్‌ జిల్లాలో పెరిగిందని అధికారులు పేర్కొంటున్నారు. 


వ్యాధి నిర్దారణ అయిన ప్రాంతంలో ద్రావణం పిచికారి

మంచిర్యాల టౌన్‌: జిల్లా కేంద్రంలోని 5వ వార్డు కైలాసగిరి కాలనీలో కరోనా నిర్ధారణ కావడంతో సోమవారం ఆ ప్రాంతంలో సోడియం హైపోక్లోరైడ్‌ ద్రావణంతోపాటు బ్లీచింగ్‌ పౌడర్‌ చల్లారు. కైలాసగిరి ప్రాంతాన్ని కట్టడి ప్రాంతంగా ప్రకటించారు. వార్డు కౌన్సిలర్‌ సుదమల్ల హరికృష్ణ నేతృత్వంలో మున్సిపల్‌ సిబ్బంది చర్యలు తీసు కుంటున్నారు. కాలనీ కమిటీ అధ్యక్షుడు విష్ణు, సభ్యులు అశోక్‌, సురేష్‌, గణేష్‌ పాల్గొన్నారు. 


శ్రీరాంపూర్‌లో కార్మిక కుటుంబాల్లో ఇద్దరికి - బెల్లంపల్లి ఐసోలేషన్‌కు తరలింపు

శ్రీరాంపూర్‌: శ్రీరాంపూర్‌ ఏరియాలో కరోనా వైరస్‌  విస్తరిస్తోంది. అరుణక్కనగర్‌లో సింగరేణి కార్మికునికి,  గాంధీనగర్‌లో కార్మికుని తల్లికి పాజిటివ్‌ నిర్ధారణ అ య్యింది. వీరిని సోమవారం బెల్లంపల్లి ఐసోలేషన్‌కు తర లించి చికిత్స అందిస్తున్నారు. అరుణక్కనగర్‌కు చెందిన కార్మికుడు 10 రోజుల క్రితం కొత్తగూడెం వెళ్ళి వచ్చిన తరువాత తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. మూడు రోజుల క్రితం బెల్లంపల్లి ఐసోలేషన్‌కు పంపించారు. రక్తనమూనాలను హైదరాబాద్‌కు పంపడంతో కరోనా పాజిటీవ్‌ వచ్చినట్లు వైద్యులు నిర్ధారించారు.


గాంధీ నగర్‌కు చెందిన ఓ కార్మికుని తల్లి హైదరాబాద్‌లో ఉంటున్న కొడుకు వద్ద నుంచి 10 రోజుల క్రితం తిరిగి వచ్చింది. అప్పటికే శ్వాస సమస్యలతో బాధపడుతున్న ఆమె మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకోగా ఐసోలేషన్‌కు పంపించారు. కరోనా లక్షణాలు లేవని నాలుగు రోజుల క్రితం తిరిగి పంపిం చారు. మరునాడే అస్వస్థతకు గురి కావడంతో మళ్లీ ఐసోలేషన్‌కు పంపి పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటీవ్‌ నిర్ధారణ అయ్యింది. సోమవారం పీహెచ్‌సీ వైద్య సిబ్బంది ఈ రెండు ఏరియాను సందర్శించి స్థాని కులు స్వీయ నియంత్రణ పాటించాలని సూచించారు. 

 

అప్రమత్తమైన అధికార యంత్రాంగం

నస్పూర్‌: నస్పూర్‌ మున్సిపాలిటీ పరిధిలోని షిర్కే కాలనీలో కార్మిక కుటుంబానికి చెందిన ముగ్గురు కరోనా బారినపడ్డారు. ఇటీవల కార్మికుడు కరోనా సోకగా ఆయ న భార్య, ఇద్దరు పిల్లలకు సోమవారం కరోనా నిర్థారణ అయ్యింది. వీరిని బెల్లంపల్లి ఐసోలేషన్‌కు తరలించినట్లు సీసీసీ ఎస్సై ప్రమోద్‌ రెడ్డి తెలిపారు. విద్యానగర్‌ లో యువకుడికి కరోనా సోకడంతో మున్సిపల్‌ సిబ్బంది పారిశుధ్య పనులు చేపట్టారు. కాలనీలో సోడియం హైపోక్లోరిన్‌ ద్రావణం స్ర్పే చేశారు. సీసీసీలో ముగ్గురికి కరోనా నిర్ధారణ అయ్యిందని పీహెచ్‌సీ వైద్యాధికారి అనిత తెలిపారు.  

Updated Date - 2020-07-07T10:35:00+05:30 IST