ఒంగోలు (కార్పొరేషన్) డిసెంబరు 4: జిల్లాలో శుక్రవారం కొత్తగా 20 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ర్యాపిడ్ పరీక్షల్లో 11మందికి, వీఆర్‌డీఎల్ పరీక్షల్లో 9 మందికి వైరస్ ఉన్నట్లు తేలింది. తాజా కేసులు ఒంగోలు, మార్కాపురం, చిన్నగంజాం, కొనకనమిట్ల, చీరాల, వేటపాలెం, యర్రగొండపాలెం, అద్దంకిలో వెలుగు చూశాయి.