Abn logo
Nov 30 2020 @ 12:45PM

తిరుపతిలో బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్

తిరుపతి: నగరంలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల కళ్లుగప్పి తప్పించుకున్న తిరుగుతున్న ముగ్గురు ఎట్టకేలకు నగర పోలీసులకు చిక్కారు. ఈ ముఠా నుంచి సుమారుగా రూ. 20 లక్షల విలువైన బైక్‎లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. వీరు ముగ్గురు బైక్ దొంగతనాలకు పాల్పడి, వాటిని తక్కువ ధరకు అమ్ముకుని జల్సాలకు అలవాటుపడినట్లు పోలీసులు తెలిపారు.

Advertisement
Advertisement
Advertisement