ప్రైవేటు ఆస్పత్రుల్లో 20 శాతం బెడ్లు కరోనా పేషెంట్లకే: ఢిల్లీ ప్రభుత్వం

ABN , First Publish Date - 2020-05-26T00:38:33+05:30 IST

కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఢీల్లీ ప్రభుత్వం రోగుల చికిత్సలో ఎటువంటి అడ్డంకులు ఏర్పడకుండా ఉండేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. 50 పడకల కంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న ఆస్పత్రుల్లో 20 శాతం బెడ్లను కరోనా పేషెంట్లకు రిజర్వ్ చేసి ఉంచాలని కేజ్రీవాల్ ప్రభుత్వం తాజాగా ఆదేశాలు జారీ చేసింది.

ప్రైవేటు ఆస్పత్రుల్లో 20 శాతం బెడ్లు కరోనా పేషెంట్లకే: ఢిల్లీ ప్రభుత్వం

న్యూఢిల్లీ: కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఢీల్లీ ప్రభుత్వం రోగుల చికిత్సలో ఎటువంటి అడ్డంకులు ఏర్పడకుండా ఉండేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. 50 పడకల కంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న ఆస్పత్రుల్లో 20 శాతం బెడ్లను కరోనా పేషెంట్లకు రిజర్వ్ చేసి ఉంచాలని కేజ్రీవాల్ ప్రభుత్వం తాజాగా ఆదేశాలు జారీ చేసింది. అదే సమయంలో ఆయా ఆస్పత్రులు తమ సామర్థ్యాన్ని మరో 25 శాతం పడకలకు పెంచుకునేందుకు కూడా ప్రభుత్వం జాతీయ విపత్తు నిర్వహణ చట్టం కింద అనుమతించింది. కరోనా రోగుల వైద్య ఖర్చులు కూడా ఆస్పత్రి యాజమాన్యాలు నిర్ణయించే స్వేఛ్చను ఇచ్చింది. అయితే అదనంగా జోడించిన 25 శాతం పడకల్లో మాత్రం వైద్య ఖర్చులు..ఎకనామిక్ క్యాటగిరీ చార్జీలకు 50 శాతం మించకూడదని స్పష్టం చేసింది. ఈ ఆదేశాల ద్వారా రాజధానిలోని 117 ప్రైవేటు ఆస్పత్రులు ప్రభుత్వ అజమాయిషీలోకి వస్తాయని తెలుస్తోంది. ఇక ఆదివారం నాడు ఢిల్లీలో కొత్తగా 508 కేసులు నమోదవడటంతో మొత్తం కేసుల సంఖ్య 13,418కి చేరుకుంది. మరణాల సంఖ్య కూడా 261కి చేరింది. 

Updated Date - 2020-05-26T00:38:33+05:30 IST